‘సంప్రదాయ పద్ధతుల్లో గణేష్ ఉత్సవాలు’
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:46 PM
జిల్లాలో ఈ ఏడాది చేపట్టనున్న గణేష్ ఉత్సవాలను సంప్ర దాయ పద్ధతుల్లో నిర్వహిం చాలని గణేష్ ఉత్సవ సమి తి జిల్లా కార్యదర్శి గొద్దు భాస్కరరావు అన్నా రు.
శ్రీకాకుళం లీగల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది చేపట్టనున్న గణేష్ ఉత్సవాలను సంప్ర దాయ పద్ధతుల్లో నిర్వహిం చాలని గణేష్ ఉత్సవ సమి తి జిల్లా కార్యదర్శి గొద్దు భాస్కరరావు అన్నా రు. జీటీ రోడ్డులోని జిల్లా గణే ష్ ఉత్సవ సమితి కార్యాల యంలో ఆదివారం ఉత్సవ సమితి జిల్లా ప్రఽథమ సర్వ సభ్య సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర కార్యదర్శి విష్ణుమూర్తి మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లోనూ కమిటీలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ఉత్సవ కమి టీకి ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా బుర్రా ఆది నారాయణ శాస్త్రి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గొద్దు భాస్కర రావు, కోశాధికారిగా ఇప్పిలి కృష్ణారావు, కార్యా లయ కార్యదర్శిగా ఎస్వీ రమణ మూర్తి, సహాయ కార్యదర్శులుగా వి.నాగేశ్వరరావు, డాక్టర్ భరత్ శేషగిరిరావు, జలుమూరు వెంకటేశ్వర రావు, ఆధ్యాత్మిక సలహాదారుగా ధర్మపురి గౌరీ శంకర శాస్త్రి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో వీనస్ హరి, వెంకుబాబు, నీలం రాజు తదితరులు పాల్గొన్నారు.