Share News

గాంధీజీ విగ్రహం ధ్వంసం

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:20 AM

రణ స్థలం జడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.

గాంధీజీ విగ్రహం ధ్వంసం
గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దృశ్యం

రణస్థలం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): రణ స్థలం జడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. విగ్రహం చేతులను తొలగించారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యా రు. అయితే ఈ ఘటనపై ఎటువంటి పోలీస్‌ కేసు నమోదు కాలేదు. కానీ స్థానికులు మా త్రం ఇది ఆకతాయిల పని అయి ఉంటుందన్న అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై ఎటవంటి ఫిర్యాదు రాలేదని జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపారు.

Updated Date - Jan 04 , 2026 | 12:20 AM