Share News

దేశభక్తికి కేంద్రంగా గాంధీ మందిరం

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:15 AM

దేశభక్తి కార్యక్రమాలకు కేంద్రం గా గాంధీ మందిరం నిలుస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

దేశభక్తికి కేంద్రంగా గాంధీ మందిరం
జైజవాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

ఎమ్మెల్యే గొండు శంకర్‌

స్వాతంత్య్ర సమరయోధులు, జైజవాన్‌ విగ్రహాల ఆవిష్కరణ

పాత శ్రీకాకుళం అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): దేశభక్తి కార్యక్రమాలకు కేంద్రం గా గాంధీ మందిరం నిలుస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. గాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సంద ర్భంగా శాంతినగర్‌ కాలనీలోని స్వాతం త్య్ర సమరయోధుల వనంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌, భారతరత్న మదన్‌ మోహ న్‌ మాలవ్యా, జై జవాన్‌-జైకిసాన్‌ విగ్రహాలను శుక్రవారం ఆవిష్కరించారు. గాంధీ, శాస్త్రి విగ్ర హాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పూర్ణ చంద్రరావు, కెప్టెన్‌ ఈశ్వరరావు, అల్లు మురళి, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహి స్తున్న దార్లపూడి రవి, బెజ్జి పురం యూత్‌క్లబ్‌ డైరెక్టర్‌ ప్రసాదరావుతో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలను అందించిన వారిని సత్కరిం చారు. రఘుపాత్రుని శ్రీకాంత్‌ పర్యవేక్షణలో శిష్య బృందం నృత్యాభినయం ఆక ట్టుకుంది. కార్యక్ర మంలో సిక్కోలు వనిత స్క్వా డ్రన్‌ లీడర్‌ కృష ్ణకుమారి, తెలుగు మహిళ నాయ కురాలు గొం డు స్వాతి, మందిరం ప్రతి నిధులు ఎంవీవీఎస్‌ శాస్త్రి, జామి భీమశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 12:15 AM