అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:53 AM
జమ్ము-కశ్మీర్ సంభవించిన తుఫాన్ ప్రభావం తో చెట్టుకొమ్మ విరిగిపడి మృతి చెందిన ఆర్మీ జవాన్ (నాయక్ సుబేదార్) శిమ్మ సూర్యనారాయ ణకు స్వగ్రామం ఒప్పంగి గ్రా మంలో అధికార లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వ హించారు.
ఆర్మీ జవాన్ సూర్యనారాయణకు కన్నీటి వీడ్కోలు
శ్రీకాకుళం రూరల్, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): జమ్ము-కశ్మీర్ సంభవించిన తుఫాన్ ప్రభావం తో చెట్టుకొమ్మ విరిగిపడి మృతి చెందిన ఆర్మీ జవాన్ (నాయక్ సుబేదార్) శిమ్మ సూర్యనారాయ ణకు స్వగ్రామం ఒప్పంగి గ్రా మంలో అధికార లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వ హించారు. ఆర్మీ వాహనంలో సూర్యనారాయణ పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా గ్రామస్థులంతా ఊరేగింపు నిర్వహించారు. ఆర్మీ, పోలీసు అధికారులు మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు పూర్తి చేశారు. సూర్యనారాయణ ఆర్మీలో వివిధ హోదాల్లో సుమారు 20 ఏళ్ల పాటు విధులు నిర్వహించారు. కాగా ఎమ్మెల్యే గొండు శంకర్ గ్రామానికి చేరుకుని సూర్యనారాయణ పార్థివదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశరక్షణలో ఉంటూ మృతి చెందడం అత్యంత బాధాకరమని, నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన సూర్యనారాయణ ప్రతిఒక్కరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.