Share News

విశ్రాంత హవల్దార్‌కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:25 PM

పట్ట ణానికి చెందిన రిటైర్డ్‌ హవల్దార్‌ దేవేంద్ర బెహ రా(85) గుండె పోటుతో శనివారం మృతి చెందారు.

 విశ్రాంత హవల్దార్‌కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న మాజీ సైనికోద్యోగులు

ఇచ్ఛాపురం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పట్ట ణానికి చెందిన రిటైర్డ్‌ హవల్దార్‌ దేవేంద్ర బెహ రా(85) గుండె పోటుతో శనివారం మృతి చెందారు. విషయం తెలుసు కున్న తోటి మాజీ సైనికో ద్యోగులు ఆయన అంతి మయాత్రలో పాల్గొన్నారు. బాహుదానదిలో మృతదేహంపై జాతీయ పతాకాన్ని ఉంచి సెల్యూట్‌చేశారు. అనం తరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దేశ సేవలో ఆయన చేసిన సేవలను కొనియా డారు. క్లిష్టతరమైన పరిస్థితులను సైతం ఎదుర్కొని ధైర్యసాహసాలతో విధులు నిర్వహించారన్నారు. కార్గిల్‌ యుద్ధంలో పాల్గొని దేశానికి గర్వకా రణంగా నిలిచారని, ఆయన మృతి తీరని లోటని మాజీ సైనికోద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ రావు, రాజులు రెడ్డి అన్నారు. నివాళులు అర్పించిన వారిలో మాజీ సైనికోద్యోగులు డి.విశ్వనాథంరెడ్డి, యు.శంకర్‌, జగన్నాథ రెడ్డి, కురయ్య, చౌదరి తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 11:25 PM