Share News

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:59 PM

నా అన్న వారు లేరు.. ఊరు, పేరు తెలియదు.. శ్మశాన వాటికే వారి నివాసం.. ఎండైనా, వానైనా అక్కడే గడిపేవారు తల్లీ కొడుకులు... ఏడాది కిందట తల్లి మృతి చెందగా సోమవారం కుమారుడు చనిపో యాడు.

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు
అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేస్తున్న స్థానికులు

రణస్థలం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): నా అన్న వారు లేరు.. ఊరు, పేరు తెలియదు.. శ్మశాన వాటికే వారి నివాసం.. ఎండైనా, వానైనా అక్కడే గడిపేవారు తల్లీ కొడుకులు... ఏడాది కిందట తల్లి మృతి చెందగా సోమవారం కుమారుడు చనిపో యాడు. దీంతో స్థానికులే దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మండల కేంద్రంలో శ్మశాన వాటికలో రెండేళ్ల కిందటి నుంచి తల్లీ కుమారుడు తలదాచుకునేవారు. చిత్తు కాగితా లు, చెత్త ఏరుకొని వాటిని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తంతో జీవనం సాగించారు. అప్పుడప్పు డు స్థానికంగా ఉన్న ప్రజలు, యువకులు కొంత మొత్తం ఇచ్చేవారు. ఇద్దరూ మానసిక రుగ్మతతో బాధపడు తూ కనీసం వారి పేరు కూడా చెప్పలేక పోయేవారు. ఏడాది కిందట తల్లి చనిపోగా స్థానికుల సాయంతో కుమారుడు అంత్యక్రియలు చేశాడు. అయితే అతడికి మూర్ఛవ్యాధి ఉండేది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత మూర్ఛ రాగా ఎవరూ లేకపోవడంతో మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడి అంత్య క్రియలు చేశారు. మృతుడి వయసు సుమారు 35 సంవత్సరా లు ఉంటుందని వారు తెలిపారు. అనాథకు అంతిమ సంస్కారాలు చేసి మానవత్వం యువకులు చాటు కోవడంతో వారిని గ్రామస్థులు అభినందించారు.

Updated Date - Jan 27 , 2026 | 11:59 PM