Share News

సాగునీటి వనరులకు నిధులు ఇవ్వాలి

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:35 PM

నియోజకవర్గంలోని కంచిలి మండ లంలోని సాగునీటి వనరులకు నిధులు అందించి రైతులకు మేలు చేయా లని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ కోరారు. ఈమేరకు ఆదివారం మంగళగిరిలోని టీడీపీకార్యాలయంలో సీఎం చంద్రబాబునాయుడును కలిసి వినతిపత్రాన్ని అందించారు.

సాగునీటి వనరులకు నిధులు ఇవ్వాలి
చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తున్న బెందాళం అశోక్‌:

కవిటి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని కంచిలి మండ లంలోని సాగునీటి వనరులకు నిధులు అందించి రైతులకు మేలు చేయా లని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ కోరారు. ఈమేరకు ఆదివారం మంగళగిరిలోని టీడీపీకార్యాలయంలో సీఎం చంద్రబాబునాయుడును కలిసి వినతిపత్రాన్ని అందించారు. కంచిలి మం డలంలోని గంగాసాగరాన్ని మినీరిజర్వాయర్‌గా ఏర్పాటుకు, సుంకిలిసాగ రం మరమతులకు నిధులు కేటాయించాలని కోరారు. గతంలో నిధులు వచ్చినా పనులను పూర్తి చేయకుండా నిలుపుదల చేశారని తెలిపారు. కంచిలి మండలంలో వీటి ప్రాధా న్యతను, రైతులకు కలిగే ప్రయో జనాలను వివరించారు నియోజక వర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని, పరిష్కారానికి సహాకారం అందించాలని కోరామని ఎమ్మెల్యే అశోక్‌ తెలిపారు. సాగు నీటివనరులను అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం తెలి యజేశారని అశోక్‌ చెప్పారు.

Updated Date - Aug 09 , 2026 | 11:35 PM