వయోడెక్ట్‌కు నిధుల మంజూరు
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:48 PM
పాతపట్నంలో ఫ్లైఓవర్ వంతెన నమూనా మార్పుతోపాటు వయోడెక్ట్‌కు అదనంగా రూ.8.60కోట్లు మంజూరయ్యాయని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు.
పాతపట్నం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): పాతపట్నంలో ఫ్లైఓవర్ వంతెన నమూనా మార్పుతోపాటు వయోడెక్ట్‌కు అదనంగా రూ.8.60కోట్లు మంజూరయ్యాయని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఎనిమిదో తేదీన ఆంధ్రజ్యోతిలో ఎనిమిదేళ్లుగా శీర్షికతో ఫ్లైఓవర్ పనులు నత్తనకడన సాగడంపై కథనం ప్రచురితమయ్యింది. ఈమేరకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడును ఎమ్మెల్యే కలిసి సమస్య వివరించారు. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణ నమూనాను నీలమణిదుర్గ ఆలయం వద్ద ఐదు పిల్లర్లతో నాలుగు స్పాన్‌లు ఉండేలా నమూనామార్పుతో వయాడక్ట్ నిర్మాణానికి ఆమోదం లభించిందని ఎమ్మెల్యే తెలిపారు. తొలుత కేవలం రెండు వెహికల్ అండర్‌పాస్‌లకు మాత్రమే రూపొందించా రని, రామ్మోహన్‌నాయుడు చొరవచూపి ఆలయప్రాశస్త్యాన్ని కేంద్రంలోని అఽధికారులకు అధికారులకు వివరించి భక్తుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు వీలుగా నమూనామార్చేలా ఒప్పించేందుకు చేసిన కృషి ఫలించిందని పేర్కొన్నారు. కేంద్రమంత్రిని ఎమ్మెల్యేతోపాటు టీడీపీ నాయకులు పైల బాబ్జీ, సైలాడ సతీష్, బండి రవివర్మ, అక్కంద్ర సన్యాసిరావు, శాసనపురి మధుబాబు, రఘుబాబు, రుంకు చలపతిరావు, కరకవలస మన్మఽథరావు, శివాల చిన్నయ్య తదితరులు కలిశారు.