పిచ్చిమొక్కలతో నిండి.. పనులు నిలిచిపోయి
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:43 PM
మం డలంలోని పెద్ద బాణాపురం గ్రామ సచివాల యానికి సంబంధించి భవనాల నిర్మాణాలు పునాది స్థాయిలోనే నిలిచిపోయాయి. పనులు నిలిచిపోవడంతో జనసంచారంలేక పిచ్చిమొక్క లతో నిండిపోయాయి.
నందిగాం,జనవరి 14(ఆంధ్రజ్యోతి): మం డలంలోని పెద్ద బాణాపురం గ్రామ సచివాల యానికి సంబంధించి భవనాల నిర్మాణాలు పునాది స్థాయిలోనే నిలిచిపోయాయి. పనులు నిలిచిపోవడంతో జనసంచారంలేక పిచ్చిమొక్క లతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పంచాయతీ భవనంలోని ఇరుకు గదిలోనే సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దబాణాపురం, ఆనందపురం పంచాయతీలు కలిపి సచివాలయంగా ఏర్పాటుచేశారు. దీంతో గ్రామ సచివాలయంతోపాటు వెలెనెస్ సెంటర్, రైతుసేవా కేంద్రాల భవనాలు మం జూరయ్యా యి. సచివాలయ భవనానికి రూ.40 లక్షలు, రైతు సేవా కేంద్రానికి రూ.21లక్షలు, వెల్‌నెస్ సెంటర్‌కు రూ.15లక్షలు చొప్పున్న ఉపాధి హామీపథకం కింద నిధులు మంజూరయ్యా యి.ఈ సచివాలయం నిర్మాణంలో కాంట్రాక్టరు ముఖం చాటేయడంతోపాటు ప్రభుత్వం మారిపోవడంతో పునాది స్థాయిలోనే ఆయా భవనాలు నిలిచిపోయాయి. దీనికితోడు పర్య వేక్షణ లేకపోవడంతో పిచ్చిమొక్కలు, ముళ్లపొ దలతో నిండి దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం సచివాలయం సేవలు స్థానిక పంచాయతీ భవ నంలో చాలీచాలని వసతి మధ్య నిర్వహిస్తున్నా రు. దీంతో విధులు నిర్వహణకు సిబ్బంది తోపాటు పనులపై వచ్చే సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. వెల్‌నెస్ సెంటర్, రైతు సేవా కేంద్రం పరాయిపంచలో కొనసాగుతున్నాయి. అయితే వైసీపీ హయాంలో ప్రారంభించిన పనుల మేరకు బిల్లులు చెల్లింపు జరిగాయి. ప్రభుత్వం మారడంతో బిల్లులు కావన్న అను మానంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. కాగా భవనాలు అసంపూర్తిగా మిగల డంపై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లామని, తదుపరి సూచనలు మేరకు చర్యలు చేపడతామని మండల ఇంజనీరింగ్ అధికారి పి.సంతోష్‌కుమార్ తెలిపారు.