Share News

రైతులకు సంపూర్ణ భూహక్కులు

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:14 PM

రైతులకు సంపూర్ణ భూ హక్కులు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దక్కుతుందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

 రైతులకు సంపూర్ణ భూహక్కులు
సరుబుజ్జిలి: మహిళా రైతుకు పట్టాదారు పాసుపుస్తకం అందిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

-ఎమ్మెల్యే రవికుమార్‌

- పాసు పుస్తకాల పంపిణీ

సరుబుజ్జిలి/బూర్జ ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి ): రైతులకు సంపూర్ణ భూ హక్కులు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దక్కుతుందని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. మంగళవారం సరుబుజ్జిలి మండలం లొద్దల కాగితాపల్లి, బూర్జ మండలం లాభాం గ్రామాల్లో రైతులకు రాజముద్రతో కూడిన పట్టదారు పాస్‌పుస్తకా లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌ తన ఫొటోను రైతులకు చెందిన పట్టాదారు పుస్తకాలపై వేసుకుని భూ హక్కు లను కాలరాశాడన్నారు. హద్దురాళ్లపై కూడా ఫొటో వేసుకుని రూ.750 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరు వాత మీ భూమి.. మీ హక్కు పేరిట ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్‌పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాద్‌, ఏపీ మార్కెట్‌ డైరెక్టర్‌ ఎ.రామకృష్ణనాయుడు, తహసీ ల్దార్లు ఎల్‌.మధుసూదన్‌, పద్మావతి, ఎంపీడీవోలు ఎం.పావని, తిరుపతిరావు, సర్పంచ్‌ పి.కృష్ణారా వు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి పి.రా మ్మోహన్‌, టీడీపీ నాయకులు అంబళ్ల రాంబా బు, నూక కోటేశ్వరరావు తాడేల వెంకటరమణ, వెలమల రమేష్‌, తదితరులు పాల్గొన్నారు. .

భూవివాదాలు లేకుండా చేస్తాం: ఎమ్మెల్యే ఈశ్వరరావు

రణస్థలం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): గ్రామా ల్లో భూ వివాదాలు లేకుండా చేయడమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. మంగళవారం పాతర్లపల్లి గ్రామంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక శ్యామలరావు, గొర్లె సాయి దీప్‌, పిసిని జగన్నాథంనాయుడు, పిన్నింటి భా నోజినాయుడు, తహసీల్దార్‌ సనపల కిరణ్‌కు మార్‌, ఎంపీడీవో ఈశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:14 PM