Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి..

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:10 AM

జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వందల కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి.

వైసీపీ నుంచి టీడీపీలోకి..
కోటబొమ్మాళి టీడీపీలో చేరిన వైసీపీ నాయకులతో మంత్రి అచ్చెన్న

  • వందల కుటుంబాలు చేరిక

జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వందల కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి. వీరికి టీడీపీ కండువాలు వేసి ప్రజాప్రతినిధులు ఆహ్వానిస్తున్నారు.

మంత్రి అచ్చెన్న సమక్షంలో..

కోటబొమ్మాళి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): కొత్తపేట పంచాయతీకి చెంది న వైసీపీ నాయకులు సకాలభక్తుల గిరి, సుంకర ఆనందరావు, జామి శేఖర్‌, సకలాభక్తుల దుర్గారావుతోపాటు మరికొన్ని కుటుంబాలు శుక్రవారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. నిమ్మాడ తన క్యాంపు కార్యాలయంలో వీరందరికీ మంత్రి పార్టీ కండువాలు వేసి ఆహ్వానిం చారు. అలాగే శ్రీకాకుళం జడ్పీ చైర్‌పర్సన్‌గా కూటమి తరుఫున జనసేన పార్టీ నుంచి ఎన్నికైన కొరినాన భవానీ, అమె భర్త సుడా చైర్మన్‌ కొరికాన రవికుమా ర్‌ శుక్రవారం నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరికి శుభాకాంక్షలు తెలిపి.. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృ ద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి తదితరులు ఉన్నారు.

ఆమదాలవలసలో 300 కుటుంబాలు..

ఆమదాలవలస, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస పట్టణ పరిధిలోని దాదాపు 300 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. శుక్రవారం పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సమక్షంలో పార్టీ కార్యాల యంలో వివిధ సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో పలువురు తమ కుటుంబా లతో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. జిల్లా సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు జేజే మోహన్‌రావు, పట్టణ రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు జేకే వెంకన్నబాబు, జిల్లా క్రికెట్‌ సంఘం మాజీ అధ్యక్షుడు జె.భాస్కరరావు ఆధ్వర్యంలో ఆయా కుటుంబాలు టీడీపీలో చేరాయి. జీకే బ్రదర్స్‌తో కలిసి జిల్లా ఎక్స్‌సర్వీస్‌మన్‌ సంఘ అధ్యక్షు డు కటకం పూర్ణచంద్రరావు, పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు కె.నాగేశ్వ రరావు, పట్టణ టైలర్ల సంఘ అధ్యక్షులు, సభ్యులు, పట్టణ క్లాత్‌ మర్చంట్‌ యూ నిట్‌ సభ్యులు, ముస్లిం సంఘాల నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరందరికి ఎమ్మెల్యే రవికుమార్‌ టీడీపీ కండువాలు వేసి ఆహ్వానించారు.

కొల్లిపేట నుంచి 30 కుటుంబాలు..

పొందూరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల వేళ లైదాం పంచాయతీ కొల్లిపేటలో వైసీపీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ నుంచి 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వీరికి ఎమ్మెల్యే కూన రవికుమార్‌ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి బలగ శంకరభాస్కర్‌, మాజీ సర్పంచ్‌ గొర్లె అనంతరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 12:10 AM