సిక్కోలు నుంచి ఢిల్లీకి..
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:13 AM
Selection of Ippili students for Republic Day ఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారు. శ్రీకాకుళం మండలం ఇప్పిలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇప్పిలి సంజన, పిల్ల అలేఖ్య అనే విద్యార్థినులతో పాటు గైడ్ ఉపాధ్యాయులు సువారి ఉమామహేశ్వరికి ప్రత్యేక అతిఽథులుగా హాజరుకావాలని నీత్ ఆయాగ్ సంస్థ నుంచి పిలుపు వచ్చింది.
గణతంత్ర వేడుకలకు ఇప్పిలి విద్యార్థినుల ఎంపిక
నరసన్నపేట, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారు. శ్రీకాకుళం మండలం ఇప్పిలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇప్పిలి సంజన, పిల్ల అలేఖ్య అనే విద్యార్థినులతో పాటు గైడ్ ఉపాధ్యాయులు సువారి ఉమామహేశ్వరికి ప్రత్యేక అతిఽథులుగా హాజరుకావాలని నీత్ ఆయాగ్ సంస్థ నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు ఈనెల 23 నుంచి 27 వరకు ఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో వారు పాల్గొనున్నట్లు ప్రధానోపాధ్యాయులు ఎ.సుజాత తెలిపారు.
‘అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఎయిమ్) రూపొందించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టు చేయడంలో 2022 నుంచి ఇప్పటివరకు ఇప్పిలి పాఠశాల విద్యార్థినులు ఆటల్ మారథాన్, స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌లో జాతీయస్థాయిలో ఎంపికయ్యారు. సంజన, అలేఖ్య తయారుచేసిన ‘అవర్ స్కూల్ ఎలక్ర్టిసిటీ బిల్ ఈజ్ నిల్ విత్ మై డివైస్’(డ్యూయిల్ యాక్సిస్ సోలార్ ట్రాకర్ సిస్టం), అటల్ షీ ప్రీన్యూర్ ప్రోగ్రాంలో జాతీయస్థాయిలో 30వ స్థానం సాధించారు. జాతీయస్థాయిలో గణతంత్ర వేడుకుల్లో రాష్ట్రం నుంచి రెండు పాఠశాలల విద్యార్థులు పాల్గొనేందుకు అవకాశం రాగా.. అందులో ఇప్పిలి పాఠశాలకు కూడా చోటు దక్కడం ఆనందం ఉంద’ని హెచ్‌ఎం సుజాత వెల్లడించారు.