Share News

ఒడిశా నుంచి బెంగళూరు

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:33 PM

32 kg of marijuana transported పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా.. గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. తాజాగా గురువారం ఒడిశా నుంచి బెంగళూర్‌కు గంజాయి తరలిస్తూ ఐదుగురు వ్యక్తులు ఇచ్ఛాపురం రైల్వెస్టేషన్‌లో పోలీసులకు పట్టుబడ్డారు.

ఒడిశా నుంచి బెంగళూరు
మాట్లాడుతున్న సీఐ చిన్నంనాయుడు, పోలీసుల అదుపులో నిందితుడు

32 కేజీల గంజాయి రవాణా

ఐదురుగు అరెస్టు

ఇచ్ఛాపురం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా.. గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. తాజాగా గురువారం ఒడిశా నుంచి బెంగళూర్‌కు గంజాయి తరలిస్తూ ఐదుగురు వ్యక్తులు ఇచ్ఛాపురం రైల్వెస్టేషన్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. అందులో నలుగురు మహిళలు కూడా ఉండడం గమనార్హం. 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని.. ఆ ఐదుగురిని అరెస్టు చేశామని సీఐ మీసాల చిన్నమనాయుడు తెలిపారు. సర్కిల్‌ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ‘ఒడిశా రాష్ట్రం కందమాల్‌ జిల్లాకు చెందిన శస్మితాబెహరా, సీతయ్య డల్‌చత్ర, ప్రాతిమా బెహరా, దొళాయి బోయి, నిమంఠ కన్హర్‌.. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి రవాణా మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో కందమాల్‌ జిల్లా పులబాని ఏరియా తిలారంగి గ్రామానికి చెందిన రాధాకాంత్‌ దిగల్‌ వద్ద కు వెళ్లారు. ఆయన వద్ద 32 కేజీల గంజాయిని కొనుగోలు చేసి.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఎస్‌ఐ ముకుందరావుకు వచ్చిన సమాచారం మేరకు గురువారం 8 గంటల సమయంలో రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేయగా.. ఆ ఐదుగురి వద్ద గంజాయి పట్టుబడింది. గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. ఆ ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామ’ని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై ముకుందరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 11:33 PM