ఫ్రైడేని డ్రైడేగా పాటించాలి
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:15 AM
అందరూ ఫ్రైడేని డ్రైడేగా పాటించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 19(ఆంధ్రజ్యోతి): అందరూ ఫ్రైడేని డ్రైడేగా పాటించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం నిర్వహించిన ‘ఫ్రైడే డ్రైడే’లో పాల్గొ న్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, ప్రజారోగ్య పరిర క్షణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ హెచ్.కూర్మారావు, ఆరోగ్యాధికారి డా.సుధీర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.