Share News

స్ఫూర్తిప్రదాతలు స్వాతంత్య్ర సమరయోధులు

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:28 AM

స్వాతంత్య్ర సాధనకు జీవితాలను అంకితం చేసి స్ఫూర్తి దాయకంగా నిలిచారని, వారి త్యాగాలను నిత్యం స్మరించు కోవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

స్ఫూర్తిప్రదాతలు స్వాతంత్య్ర సమరయోధులు
కలెక్టరేట్‌లో జెండా వందనం చేస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ హరిఓం పాండ్యా తదితరులు

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సాధనకు జీవితాలను అంకితం చేసి స్ఫూర్తి దాయకంగా నిలిచారని, వారి త్యాగాలను నిత్యం స్మరించు కోవాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయజెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వతంత్ర పోరాటంలో యోధులు పడిన కష్టాలు, సేవలను చిన్నపిల్లలకు సైతం తెలిసేలా వివరించాలని కోరారు. కార్యాలయ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, డీఆర్వో విశ్వేశ్వరరావులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. విద్యా ర్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. సమీకృత కలెక్టరేట్‌ ప్రాంగణంలో రూ.12 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఏడడుగుల మహాత్మాగాంధీ విగ్రహ పనులకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ శనివారం శంకుస్థాపన చేశారు. సకాలంలో పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవసరం: ఎస్పీ

శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుల పోరాట పటిమ, వారి త్యాగాలను స్మరిం చుకుని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శని వారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సమరయోధులను స్మరించుకోవడం ఎంతైనా అవసరమన్నా రు. వారి ఆశయాల స్ఫూర్తిగా దేశాభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణలో భాగ స్వాములు కావా లన్నారు. కార్య క్రమంలో ఏఎస్పీలు పి.శ్రీనివాసరావు, ఎల్‌.శేషాద్రి, డీఎస్పీ లు సీహెచ్‌ వివేకా నంద, లక్ష్మణ రావు, గోవింద రావు, భాస్కర్‌రెడ్డి, భవాని, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 2026 ఉగాదిని పుర స్కరించుకుని ప్రకటించిన పోలీస్‌ సేవా పథకా ల్లో విధి నిర్వహణలో అంకి తభావం, క్రమశిక్షణ, సమర్థత ప్రదర్శించిన పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట, ఉత్తమ సేవా పురస్కా రాలను ప్రదానం చేశారు.

ఉద్యమ స్ఫూర్తితో దేశప్రగతికి బాటలు: వీసీ

ఎచ్చెర్ల, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో దేశ ప్రగతికి బాటలు వేయాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని అన్నారు. శనివారం వర్సిటీలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతి సమె ౖక్యత, దేశ ప్రగతిలోఅందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య, ప్రిన్సిపాళ్లు ఎం.అనూరాధ, కె.స్వప్న వాహిని, రాజశేఖరరావు, సీనియర్‌ ప్రొఫెసర్‌ పి.సుజాత తదితరులు పాల్గొన్నారు.

ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో..

ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవం శనివారం నిర్వి హంచారు. జాతీయ పతాకాన్ని డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.గిరిధర్‌ ఎగురవేశారు. స్వాతం త్రోద్యమ స్ఫూర్తిని వివరించారు. అనం తరం 100 మంది విద్యార్థులు రక్త దానం చేశారు. రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ పి.జగ న్మోహన రావు, క్యాంపస్‌ ఏవో జి.శివరామ కృష్ణ, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ వాసు, వెల్ఫేర్‌ డీన్‌ శివ రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 12:28 AM