Share News

17 నుంచి ఫొటో, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:02 AM

ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ఎచ్చెర్లలోని యూనియన్‌ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యం లో 17 నుంచి ఫొటో, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్‌ ఎన్‌.రాంజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

17 నుంచి ఫొటో, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ

ఎచ్చెర్ల, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ఎచ్చెర్లలోని యూనియన్‌ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యం లో 17 నుంచి ఫొటో, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్‌ ఎన్‌.రాంజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల లోపు వయసు కలిగి పదో తరగతి చదివిన వారు అర్హులన్నారు. 30 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, ఈ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరా నిర్వహణ, ఫొటో/వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలపై నిపు ణులు శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తి కలిగిన గ్రామీణ ప్రాంత అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రవేశాల కోసం ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్‌ రోడ్డులో యూనియన్‌ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థను నేరుగా గాని, 95534 10809, 79933 40407 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 12:02 AM