‘ఎర్రన్న విద్యా సంకల్పం’లో కానిస్టేబుల్ పరీక్షలకు ఉచిత శిక్షణ
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:03 AM
‘ఎర్రన్న విద్యా సంకల్పం’ కార్య క్రమం ద్వారా శ్రీకాకుళం యువతకు 120 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.
అరసవల్లి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ‘ఎర్రన్న విద్యా సంకల్పం’ కార్య క్రమం ద్వారా శ్రీకాకుళం యువతకు 120 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్య క్రమంలో విద్యార్థులకు మొదట స్ర్కీనింగ్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తా మన్నారు. ఈనెల 14న శ్రీకాకుళం నగరంలోని విద్యాధరి కళాశాల, పలాస లోని మదర్ థెరిసా విద్యాలయం, టెక్కలి శ్రీవిశ్వజ్యోతి డిగ్రీ కళాశాల, సోంపేట కొంచాడ రాజేశ్వరరావు జూనియర్ డిగ్రీ కళాశాలల్లో ఉదయం 10 గంటలకు ఈ స్ర్కీనింగ్ పరీక్ష జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న అభ్య ర్థులు డబ్లుడబ్లుడబ్లు.వైవిఎస్‌శ్రీకాకుళం.లైవ్/ఏపీ-పోలీస్-కాని స్టేబుల్- ట్రైనింగ్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుని, పరీక్షకు హాజరుకావాల న్నారు. స్ర్కీనింగ్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి 120 రోజుల పాటు నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ ఇవ్వడంతో పాటు, స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.