Share News

అర్హులందరికీ ఉచిత న్యాయ సహాయం

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:04 AM

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయసేవా సంస్థ కృషి చేస్తుందని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.రమ్య అన్నారు.

అర్హులందరికీ ఉచిత న్యాయ సహాయం
ఆమదాలవలస: మాట్లాడుతున్న జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రమ్య

జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.రమ్య

ఆమదాలవలస, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయసేవా సంస్థ కృషి చేస్తుందని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.రమ్య అన్నారు. సోమవారం న్యాయసేవా దినోత్సవం సందర్భంగా పట్ట ణంలోని కోర్టు ఆవరణలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు కణితి విజయ లక్ష్మీబాయి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో న్యాయాధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతీ పౌరుడికి సమాన న్యాయ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్కరూ న్యాయాన్ని పొందే అవకా శాన్ని కోల్పోకూడదన్నారు. న్యాయ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందిం చేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఏజీపీ పైడి వరహా నరసింహులు, మాజీ ఏజీపీ సీపాన గోవిందరావు, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

న్యాయం దృష్టిలో అందరూ సమానులే: జ్యోత్స్న

పొందూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): న్యాయం దృష్టిలో పేదా, గొప్ప తేడా లేదని.. అందరూ సమానులేనని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.జ్యోత్స్న అన్నారు. న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా సోమవారం కోర్టు ఆవరణ లో న్యాయసహాయంపై సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయసహాయం అందించడమే న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమన్నారు. సమావేశంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 12:04 AM