Share News

చిట్టీల పేరుతో మోసం!

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:31 AM

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఆర్కే పోలీసు కాలనీకి చెందిన ఓ వ్యాపారి చిట్‌ఫండ్‌ వేస్తానని చెప్పి మొత్తం 200 మంది బాధితుల నుంచి రూ.60లక్షల వరకూ వసూలు చేసి శుక్రవారం రాత్రి పరారైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

చిట్టీల పేరుతో మోసం!

పలాస, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఆర్కే పోలీసు కాలనీకి చెందిన ఓ వ్యాపారి చిట్‌ఫండ్‌ వేస్తానని చెప్పి మొత్తం 200 మంది బాధితుల నుంచి రూ.60లక్షల వరకూ వసూలు చేసి శుక్రవారం రాత్రి పరారైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల నుంచి నమ్మకంగా వ్యవహరించి ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.30వేల వరకూ చిట్టీల పేరుతో వసూలు చేశాడు. అనంతరం వాటిని ఇవ్వకుండా మొత్తం డబ్బులతో ఉడాయించినట్లు బాధితులు లబోదిబోమంటున్నారు. వీరి కుటుంబం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉంటుండగా... బాధితులు అక్కడికి వెళ్లి ఉడాయించిన వ్యక్తి తల్లిని ప్రశ్నించారు. అయితే కుమారుడితో తనకు సంబంధం లేదని.. డబ్బులకు తాను బాధ్యురాలిని కాదంటూ ఆమె తెగేసి చెప్పింది. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.

Updated Date - Jun 20 , 2026 | 12:31 AM