Share News

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:03 AM

మర్చంట్‌ నేవీ షిప్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రాజమండ్రికి చెందిన పిట్టా గోవిందరావు, విశాఖకు చెందిన జి.రమేష్‌ రూ.2.80 లక్షలు విడతలవారీగా తీసుకుని నకిలీ లేఖ ఇచ్చి మోసం చేశారని శ్రీకాకుళం రూరల్‌ మండలం గణగళ్లవానిపేటకు చెంది న బర్రి తరుణ్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సో మవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని కలిసి సమస్యను విన్న వించాడు.

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం
వినతిని పరిశీలిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): మర్చంట్‌ నేవీ షిప్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రాజమండ్రికి చెందిన పిట్టా గోవిందరావు, విశాఖకు చెందిన జి.రమేష్‌ రూ.2.80 లక్షలు విడతలవారీగా తీసుకుని నకిలీ లేఖ ఇచ్చి మోసం చేశారని శ్రీకాకుళం రూరల్‌ మండలం గణగళ్లవానిపేటకు చెంది న బర్రి తరుణ్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సో మవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని కలిసి సమస్యను విన్న వించాడు. గత ఏడాది అక్టోబరులో తనకు నకిలీ ఉత్తర్వులు ఇచ్చి దుబాయ్‌ వెళ్లాలని చెప్పారని, అయితే అక్కడికి వెళ్లి చూడగా సదరు కంపెనీ లేదని అక్కడి వారు చెప్పార న్నారు. తిరుగు ప్రయాణమ య్యానని, తనకు చేసిన మోసంపై సదరు వ్యక్తులను నిలదీసి డబ్బులు ఇవ్వాలని నిలదీయగా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తు న్నారని, తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు.

బంగారం వేలం వేస్తామని బెదిరిస్తున్నారని..

వ్యాపార రీత్యా రుణం కోసం పలాసలో ఉన్న కీర్తన పిన్‌సెర్చ్‌ లిమిటెడ్‌ కంపెనీలో పలు దఫాలుగా 266.773 గ్రాముల బంగారం తాకట్టు పెట్టి రూ.30.09 లక్షలు తీసుకున్నానని, అయితే డబ్బు చెల్లించేందుకు వెళితే రూ.4.50 లక్షలు వడ్డీ అయిందని, కట్టకపోతే బంగారం వేలం వేస్తా మని సదరు మేనేజర్‌ బెదిరిస్తు న్నారని పలాస మండలం కాశీబుగ్గకు చెందిన అలజంగి దీక్ష ఫిర్యాదు చేశారు. తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు.

ఫిర్యాదులను త్వరతితగతిన పరిష్కరించాలి: ఎస్పీ

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ కేవీ మహే శ్వర రెడ్డి 74 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యా దుదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

Updated Date - Oct 13 , 2026 | 12:03 AM