ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:09 AM
ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి రూ.లక్షలు వసూలు చేసిన నలుగురికి పలాస మున్సిఫ్ కోర్టు న్యాయాధికారి జైలు, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పినట్టు సీఐ వై.రామకృష్ణ తెలిపారు.
నలుగురికి జైలు, జరిమానా
పలాస, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి రూ.లక్షలు వసూలు చేసిన నలుగురికి పలాస మున్సిఫ్ కోర్టు న్యాయాధికారి జైలు, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పినట్టు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. పలాస మండలం ఉద యపురం కాలనీకి చెందిన రాజాన కూర్మారావుకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెబుతూ విశాఖపట్నానికి చెందిన వాండ్రాసి సన్యాసిరావు, ఎన్‌ఏడీ కొత్తరోడ్డుకు చెందిన రావాడ నాగేశ్వరరావు, పాతగాజువాకకు చెందిన కలువూరు ఆదినారా యణ, పెదగంట్యాడకు చెందిన ముంజేటి శ్రీను 2014 జూన్‌లో నకిలీ పత్రాలు అందించి రూ.6 లక్షలు తీసుకున్నారు. అనంతరం మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు కూర్మారావు అప్పట్లో కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూర్మా రావుతోపాటు పలాస నియోజకవర్గంలో మరో 11 మంది నుంచి కూడా ఇదేవిధం గా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షలు చొప్పున వసూ లు చేయడంపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నిందితులను అరెస్టు చేసి పలాస కోర్టులో చార్జిషీట్ వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత గురువారం న్యాయాధికారి యు.మాధురి తీర్పు చెప్పారు. నిందితులపై నేరం రు జువు కావడంతో ఆ నలుగురికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.4500 జరిమానా విధి స్తూ తీర్పుచెప్పారు. బాధితుల తరుఫున ఏపీపీ రమేష్ వాదనలు వినిపించారు.