నలుగురు ఎస్‌ఐలకు స్థాన చలనం
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:21 AM
జిల్లాలో నలుగురు ఎస్‌ఐలకు స్థాన చలనం చేస్తూ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీకాకుళం క్రైం, జూలై 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నలుగురు ఎస్‌ఐలకు స్థాన చలనం చేస్తూ ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పొందూరు ఎస్‌ఐగా ఉన్న సత్యనారాయణను జేఆర్ పురం, సీసీఎస్ ఎస్‌ఐగా ఉన్న రాజేష్‌ను పొందూరు, జేఆర్‌పురం ఎస్‌ఐ చిరంజీవిని వీఆర్‌కు, లావేరు ఎస్‌ఐ అప్పల సూరిని జి.సిగడాంకు, జి.సిగడాం ఎస్‌ఐ సందీప్‌ను లావేరుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.