రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
ABN , Publish Date - May 10 , 2026 | 12:23 AM
అలికాం-బత్తిలి ప్రధానరోడ్డుపై రావిచెంద్రి జంక్షన్ సమీపంలో శనివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలు గురు గాయపడా ్డరు.
ఎల్‌ఎన్ పేట, మే 9(ఆంధ్రజ్యోతి): అలికాం-బత్తిలి ప్రధానరోడ్డుపై రావిచెంద్రి జంక్షన్ సమీపంలో శనివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలు గురు గాయపడా ్డరు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం మండ లం రాగోలు గ్రా మానికి చెందిన అనిల్‌కుమార్, గౌతమి, రోజారాణి హిరమండలంలో శనివారం జరుగు తున్న వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. తిరిగి వారు స్వగ్రామా నికి వస్తుండగా.. రావిచెంద్రి జంక్షన్ సమీపానికి వచ్చేసరికి కడగండివలస గ్రా మానికి చెందిన రాఘవ ద్విచక్రవాహనంపై వారి వెనుకనుంచి వస్తూ ఢీకొనడం తో రోడ్డుపై పడిపో యారు. రెండు వాహనాలపై ఉన్న నలుగురికి గాయాలయ్యా యి. సమాచారం అందుకున్న 108 వాహనం సిబ్బంది ఈఎన్‌టీ మూర్తి, పైలెట్ ఎస్‌వీ రమణ ఘటనా స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఆమదాలవలస మండలం జొన్నవలసలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శ్రీరామపురం వద్ద ఇద్దరు..
నరసన్నపేట, మే 9(ఆంధ్రజ్యోతి): శ్రీరామపురం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జలుమూరు మండలం పెద్దదూగాం గ్రామానికి చెందిన కుమారస్వామి, సాంబమూర్తి గాయపడినట్టు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండుగా.. అదుపు తప్పి బోల్తాపడ్డారు. ఈ ప్రమాదంలో కుమారస్వామికి కుడికాలు విరిగిపోగా, సాంబమూర్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నేషనల్ హైవే అంబులెన్స్‌లో శ్రీకాకుళం తరలించారు.