Share News

గొలుసు చోరీ కేసులో నలుగురి అరెస్ట్‌

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:05 PM

వీవీఆర్‌పురంలో ఆగస్టు 28న పాలక్యాన్లతో ఇంటికి వెళ్తున్న ఒక మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ చేసి పరారైన నిందితులను మందస పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందుతులైన ఒడిశా రాష్ట్రానికి చెందిన చందన మహరణ, సంగీత మహరణ, రాజేంద్ర మహరణ, భాగ్యశ్రీ మహరణలను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

గొలుసు చోరీ కేసులో నలుగురి అరెస్ట్‌
నిందితులతో ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌..

మందస, సెప్టెంబరు22 (ఆంధ్రజ్యోతి): వీవీఆర్‌పురంలో ఆగస్టు 28న పాలక్యాన్లతో ఇంటికి వెళ్తున్న ఒక మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ చేసి పరారైన నిందితులను మందస పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందుతులైన ఒడిశా రాష్ట్రానికి చెందిన చందన మహరణ, సంగీత మహరణ, రాజేంద్ర మహరణ, భాగ్యశ్రీ మహరణలను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. దేవుడి గుడి నిర్మాణ మేస్త్రీలైన చందన, రాజేంద్రలు, వారి వద్ద కూలీలుగా పనిచేస్తున్న అక్కాచెళ్లెళ్లు సంగీత, భాగ్యశ్రీలతో కలసి దొంగతనాలు చేస్తున్నారు. వీరు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా టోల్‌గేట్లు వద్ద వీరి పూర్తి వివరాలను సేకరించి అదుపులోకి తీసున్నట్లు మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ తెలిపారు. వీరు అంతకుముందు కంచిలి మండలం భైరిపురంలో జూన్‌ 29న ఛైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలియజేశారు. వీరిని అరెస్ట్‌ చేసి రెండున్నర తులాల బంగారాన్ని రికవరీ చేసి సోంపేట కోర్టులో హాజరపరిచినట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 22 , 2026 | 11:05 PM