Share News

ముప్పావు గంట నరకం..

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:29 PM

ఓ లారీ డ్రైవర్‌ ముప్పావు గంట పాటు నరకం చూశాడు. లారీ కేబీన్‌లో ఇరుక్కున్న ఆయన్ను అతి కష్టమ్మీద బయటకు తీసిన ఘటన కోష్ఠ ఫ్లైఓవర్‌ వద్ద శనివారం చోటు చేసుకుంది.

ముప్పావు గంట నరకం..
: లారీ క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ ఎర్రయ్యను బయటకు తీస్తున్న దృశ్యం

లారీ కేబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌

అతికష్టమ్మీద బయటకు తీసిన వైనం

రణస్థలం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఓ లారీ డ్రైవర్‌ ముప్పావు గంట పాటు నరకం చూశాడు. లారీ కేబీన్‌లో ఇరుక్కున్న ఆయన్ను అతి కష్టమ్మీద బయటకు తీసిన ఘటన కోష్ఠ ఫ్లైఓవర్‌ వద్ద శనివారం చోటు చేసుకుంది. విశాఖపట్నం వైపు ఇసుకతో వెళుతున్న లారీ జాతీయ రహదారిపై కోష్ట ఫ్లైఓవర్‌ వద్ద ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇసుక లారీ డ్రైవర్‌ ఎర్రిబాబు కేబిన్‌లో ఇరుక్కున్నాడు. సమాచారం అందుకున్న జేఆర్‌పురం ఎస్‌ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు ముప్పావు గంట తరువాత అతికష్టమ్మీద డ్రైవర్‌ను బయటకు తీసి హుటాహుటిన శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎర్రిబాబుకు కాళ్లు, చేతులు విరిగాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో జాతీయ రహదారి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. జేఆర్‌పురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:29 PM