మాజీ నక్సలైట్ గోవిందరావుకు సతీ వియోగం
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:48 PM
మాజీ నక్సలైట్ దుప్పల గోవింద రావు సతీమణి సావిత్రమ్మ (80) శని వారం సాయంత్రం మృతి చెందారు. వీరిది పొందూరు మండలం చినబొడ్డేపల్లి గ్రా మం. కొద్దిరోజులుగా అనా రోగ్యంతో బాధప డుతున్న సావిత్రమ్మ తుదిశ్వాస విడిచారు.
భర్తతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్న సావిత్రమ్మ
నేడు చినబొడ్డేపల్లిలో అంత్యక్రియలు
పొందూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మాజీ నక్సలైట్ దుప్పల గోవింద రావు సతీమణి సావిత్రమ్మ (80) శని వారం సాయంత్రం మృతి చెందారు. వీరిది పొందూరు మండలం చినబొడ్డేపల్లి గ్రా మం. కొద్దిరోజులుగా అనా రోగ్యంతో బాధప డుతున్న సావిత్రమ్మ తుదిశ్వాస విడిచారు. రెండు దశాబ్దాల పాటు ప్రముఖ ఉద్యమ నేత చౌదరి తేజేశ్వర రావుతోపాటు ఉద్య మంలో పనిచేసిన గోవిందరావు సుమారు దశాబ్ద కాలం జైలు జీవితం గడిపారు. భర్త ఉద్యమంలో పనిచేసే కాలంలో భార్య సావి త్రమ్మ అనేక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. అనంతరం ఉద్య మం నుంచి బయటకు వచ్చి గ్రామంలో భర్తతో కలిసి జీవనం సాగించారు. వీరికి కుమారుడు స్టాలిన్, కుమార్తె నవత ఉన్నారు. ఆదివారం స్వగ్రామం చినబొడ్డేపల్లిలో సావిత్రమ్మ అంత్యక్రియలు నిర్వ హించనున్నారు. గోవిందరావుకు ఎమ్మెల్యే కూన రవికుమార్, మాజీ స్వీకర్ తమ్మినేని సీతారాం, మాజీ సర్పంచ్ బొడ్డేపల్లి సత్యం తదితరులు సంతాపం వ్యక్తం చేసి సానుభూతి తెలిపారు. అలాగే పలువురు గ్రామస్థులు సంతాపం తెలిపారు.