మాజీ సీఎం జగన్ దళిత ద్రోహి
ABN , Publish Date - May 19 , 2026 | 11:57 PM
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి పీఎంజే బాబు అన్నారు.
టీడీపీ జిల్లా నేతలు రమేష్, పీఎంజేబాబు
అరసవల్లి, మే 19(ఆంధ్ర జ్యోతి): మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి పీఎంజే బాబు అన్నారు. మంగళ వారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లా డుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో దళితు లపై అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యంగా ఉండేవని విమర్శించారు. దళిత పక్షపాతినని పేర్కొంటూ వారి ఓట్లతో గెలిచి వారి గొంతును కోసిన ద్రోహి జగన్ అని విమర్శించారు. వైసీపీ హయాంలో దళితులపై 56,981 దాడులు జరిగాయని, 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళలపై 637 అత్యా చారాలు జరిగాయని, దళితులకు కేటాయించిన 11 వేల ఎకరాల భూములను ఆ ప్రభుత్వం వెనక్కు తీసుకుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. నేడు రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారని, అయినా సరే వైసీపీ నాయకులు వారిని తప్పు దోవ పట్టించేలా అనవసర రాద్ధాంతం చేస్తు న్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమణ మాదిగ, జిల్లా కార్యదర్శి గోర సురేష్, మహిళా నాయకులు కవ్వాడి సుశీల, కటారి కమల పాల్గొన్నారు.