న్యాయం కోసం..
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:14 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ అడ్మిషన్లకు అనుమతులు లేకపోయినా ఇద్ద రు విద్యార్థులకు గత ఏడాది అడ్మిషన్లు ఇవ్వడం.. ఏడాది తరువాత అడ్మి షన్లు రద్దు చేయడంతో ఇద్దరు విద్యార్థులు నష్టపోయారు. దీనిపై శని వారం ‘ఆంధ్రజ్యోతి’ లో ‘ఏడాది తరువాత అడ్మిషన్లు రద్దు’ శీర్షికతో కథ నం వచ్చిన సంగతి తెలిసిందే. ఏడాది పాటు పరీక్ష ఫీజు కట్టించు కోకపోవడం, మొదటి సెమిస్టర్ పరీక్షలు రాయడం, రెండో సెమిస్టర్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఫీజు చెల్లించేందుకు అవకాశం లేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు విద్యా ర్థులు తమ పరిస్థితి ఏమిటంటూ శనివారం వర్సిటీ అధికారుల చుట్టూ ప్రదక్షి ణలు చేశారు.
వర్సిటీ అధికారుల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులు
ఎచ్చెర్ల రూరల్, జూలై 25(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ అడ్మిషన్లకు అనుమతులు లేకపోయినా ఇద్ద రు విద్యార్థులకు గత ఏడాది అడ్మిషన్లు ఇవ్వడం.. ఏడాది తరువాత అడ్మి షన్లు రద్దు చేయడంతో ఇద్దరు విద్యార్థులు నష్టపోయారు. దీనిపై శని వారం ‘ఆంధ్రజ్యోతి’ లో ‘ఏడాది తరువాత అడ్మిషన్లు రద్దు’ శీర్షికతో కథ నం వచ్చిన సంగతి తెలిసిందే. ఏడాది పాటు పరీక్ష ఫీజు కట్టించు కోకపోవడం, మొదటి సెమిస్టర్ పరీక్షలు రాయడం, రెండో సెమిస్టర్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఫీజు చెల్లించేందుకు అవకాశం లేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు విద్యా ర్థులు తమ పరిస్థితి ఏమిటంటూ శనివారం వర్సిటీ అధికారుల చుట్టూ ప్రదక్షి ణలు చేశారు. మూడు రోజుల్లోగా తెలియజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
200 రోజులు హాజరు..
సదరు ఎంబీఏ విద్యార్థులు ఇప్పటి వరకు 200 రోజులు క్లాస్‌వర్కుకు హాజరుకావడం, మొదటి సెమిస్టర్ పరీక్షలు రాయడం, రెండో సెమిస్టర్‌కు సంబంధించి 75 శాతం హాజరు ఉండడంతో ఈ దిశలో అధికారులు సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇది లా ఉండగా విశ్వవిద్యాలయాలకు స్పాట్ అడ్మిషన్లకు గత సంవత్సరం ఉన్నత విద్యామండలి అనుమతి ఇవ్వలేదు. అయితే ఈ ఇద్దరి విద్యార్థు లను ఎలా చేర్చుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వర్సిటీ అధికారు లు ఎలా నిర్ణయం తీసుకున్నారనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. )