Share News

జానపద కళలను పరిరక్షించుకోవాలి

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:07 AM

జానపద కళలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉందని సినీ నటులు, జానపద కళాకారులు కుమార్‌ నాయిక్‌ అన్నారు.

జానపద కళలను పరిరక్షించుకోవాలి
కుమార్‌ నాయిక్‌ నృత్య ప్రదర్శన

హరిపురం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): జానపద కళలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉందని సినీ నటులు, జానపద కళాకారులు కుమార్‌ నాయిక్‌ అన్నారు. మందస మండలం హరిపురంలో గిడుగు రామ్మూర్తి జానపద కళాపీఠం ఆధ్వర్యంలో జానపద కళాజాతర ఆదివారం నిర్వహించారు. కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు బద్రి కూర్మారావు అధ్యక్షతన నిర్వ హించిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. అనంతరం కిల్లో యి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల థింసా నృత్యం, తోట రమణమ్మ, బృందం గైరమ్మ పాఠలు, ఉడుపుల పాటలు, మందస బైరిసారంగపురం కళాకరులచే వీరగున్నమ్మ వీరగాధ పాటలు, గువ్వాడ మల్లేష్‌ ఆధ్వర్యంలో జముకుల పాట, ఈశ్వరపాత్రో మిమిక్రీ కార్యక్రమం, బాలక లోకనాథం చే బుర్రకథ, ఎరుకల పాటలు, సుదిష్ట నృత్యం, పీత గంగయ్య బృందం తప్పెట గుళ్లు, బాడ సూరన్న జానపద గీతాలు, మడ్డు తిరుపతి ఆధ్వర్యంలో గణితం ప్రతిభ ప్రదర్శన తోపాటు మరికొన్ని జానపద గీతాలు జానపద కళలుపై ప్రదర్శనలు చేపట్టా రు. కార్యక్రమంలో బమ్మిడి సుబ్బారావు, మట్ట ఖగేశ్వర్రావు, వంకల రాజారావు, అల్ల రామేశ్వర్రావు, రిషి మాస్టర్‌, కేశవరావు, శిష్టు మనోజ్‌తోపాటు అధిక సంఖ్యలో కళాభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 12:07 AM