సైబర్ క్రైంపై ప్రత్యేక దృష్టి సారించండి
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:49 PM
పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న సైబర్ క్రైం నేరాలపై దృష్టి సారించాలని విశాఖ పట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు.
ఐజీ గోపీనాథ్ జెట్టి
ఎచ్చెర్లలో పోలీస్ గ్రౌండ్, రణస్థలంలో సీస్కో స్టేషన్ ప్రారంభం
ఆమదాలవలస/గార/ఎచ్చెర్ల/రణస్థలం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న సైబర్ క్రైం నేరాలపై దృష్టి సారించాలని విశాఖ పట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. గురువారం ఆయన ఆమదాలవలస, గార ఎచ్చెర్ల, రణస్థలంలలో పర్యటించారు. ఆమదాలవలస, గార పోలీస్‌స్టేషన్లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. గంజాయి రవా ణా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. సాలిహుండాంలోని బౌద్ధక్షేత్రం, మ్యూజియం సందర్శించారు. ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదానం లో సంకల్ప వేదిక, క్రికెట్ గ్రౌండ్, విక్టరీ గ్యాలరీ లను ప్రారంభించారు సాయుధ పోలీసు మైదానం కేవలం పెరేడ్, క్రికెట్‌కే కాకుండా అన్ని విధాలా క్రీడలు, శిక్షణ కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుందన్నారు. పరేడ్, క్రీడ లు, శారీరక శిక్షణ కార్యక్రమాల నిర్వహణలో సాయుధ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సిబ్బంది శారీరక సామర్థ్యం, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకో వాలన్నారు. పైడి భీమవరం సీస్కో పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. పైడిభీమ వరంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు వల్ల ప్రశాంత వాతవరణం ఏర్పడుతుందన్నారు. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వివిధ పరిశ్రమల్లో ఉపాధి పొందిన వారు చాలా మంది ఉన్నారని, అందుబాటులో పోలీస్‌స్టేషన్ ఉండడం వల్ల నేరాలు తగ్గు ముఖం పడతాయన్నారు. రూ.20 లక్షల ఖర్చుతో సిస్కో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సహక రించిన డాక్టర్ రెడ్డీస్ యాజ మాన్యాన్ని అభినందించారు. కార్యక్ర మాల్లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు సీహెచ్ వివేకా నంద, లక్ష్మణరావు, టి.భవానీ శేషాద్రి, సీఐలు, ఎస్‌ఐలు, రెడ్డీస్ పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు నారాయణ రెడ్డి, జోగారావు, లక్ష్మీదీప్ తదితరులు పాల్గొన్నారు.