రహదారుల పనులపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:15 PM
మండలంలో తాగునీరు, రహదారుల పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధికారు లను ఆదేశించారు.
- ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మండలంలో తాగునీరు, రహదారుల పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధికారు లను ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, హౌసింగ్, ఐటీడీఏ తదితర శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంత వరకూ శాఖల వారీగా మంజూ రైన పనులు, క్షేత్రస్థాయిలో జరిగిన పనుల స్థితిగతులపై ఎమ్మెల్యే ప్రశ్నించారు. పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకురావాలని అధికారులు సూ చించారు. సమన్వయంతో వ్యవహరించి పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ఈ మేరకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.