కాలుష్య నివారణపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:33 AM
రసాయన పరిశ్రమల నుంచి వెలువడిన కాలుష్య నివారణపై పరిశ్రమ యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ ఎస్.శరవణన్, కాలుష్య నియంత్రణ అధికారి సుదర్శన్ కోరారు.
రణస్థలం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రసాయన పరిశ్రమల నుంచి వెలువడిన కాలుష్య నివారణపై పరిశ్రమ యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ ఎస్.శరవణన్, కాలుష్య నియంత్రణ అధికారి సుదర్శన్ కోరారు. గురు వారం పైడిభీమవరంలో ఆరోయాక్టివ్ పరిశ్రమ, అపిటోరియా, డాక్టర్ రెడ్డీస్ పరిశ్రమలను సందర్శించి, ఔషధ తయారీ పరిశ్రమల్లో పర్యావర ణ పరిరక్షణ, కాలుష్య నివారణ చర్యల తీరును పరిశీలించారు. ప్రధా నంగా రసాయన పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థ జలాల శుద్ధి చేసి కర్మాగారాలు, శుద్ధిచేసిన నీటిని సముద్రంలోకి విడిచిపెట్టే మెరైన్ పైప్లైన్ పంపింగ్ వ్యవస్థను తనిఖీచేశారు. శుద్ధిచేసిన వ్యర్థజాలాల విడుదలను నిరంతరం పర్యవేక్షించే ఆన్లైన్ పర్యవేక్షణ వ్యవస్థను పరిశీలించారు. విరివిగా మొక్కలు పెంచాలని, మొక్కలకు తప్పనిసరిగా జియోట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. డాక్టర్ రెడ్డీస్ పరిశ్రమ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ పనితీరును పరిశీలించి, సూచనలుచేశారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ సిబ్బంది ఎ.రామారావు నాయుడు, పి.శ్రీనివాసరావు, వీరేంద్ర కుమార్, బి.కరుణశ్రీ, వి.వంశీ తదితరులు పాల్గొన్నారు.