‘నైపుణ్యాల పెంపుపై దృష్టి’
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:02 AM
చదువుతో పాటు ఉపాధి కల్పించే నైపుణ్యాలపై శిక్షణ తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన సూచించారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఇంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.
నరసన్నపేట, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): చదువుతో పాటు ఉపాధి కల్పించే నైపుణ్యాలపై శిక్షణ తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన సూచించారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఇంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నియోజవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ఖ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉపాధి కల్పించే విధంగా శిక్షణ ఇస్తోందని తెలిపారు. జీవనోపాధిని కల్పించే శిక్షణను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లత తదితరులు పాల్గొన్నారు.