Share News

రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:18 AM

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికా రులను ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి
మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • నేర సమీక్షలో కేసుల పురోగతిపై ఆరా

  • దర్యాప్తులో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికా రులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరి గిన నేర సమీక్ష సమావేశంలో పెం డింగ్‌ కేసుల దర్యాప్తు, రోడ్డు ప్ర మాదాల నివారణ చర్యలు, డ్రోన్లు, సాంకేతిక అప్లికేషన్ల వినియోగం, తదితర అంశాలపై సమీక్షించారు. ప్రమాదాలు జరిగిన తరువాత చర్యలు చేపట్టడం కన్నా ముందస్తు నివారణ చర్యలు చేపట్టడంతో వాటిని తగ్గించవచ్చునని అన్నారు. ట్రాఫిక్‌, భద్రతా నియమాల అమలును కఠినంగా పర్యవేక్షించడం, హెల్మెట్‌ లేని డ్రైవింగ్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌ వంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తిండం.. రోడ్డు భద్రతపై ప్రజల్లో విస్తృ త అవగాహన కల్పించడం వంటి చర్యలను మరింత బ లోపేతం చేయాలని సూచిం చారు. బాధితులకు సమయా నికి వైద్యం అందితే ప్రాణా లను కాపాడే అవకాశాలు గణ నీయంగా పెరుగుతాయ న్నారు. కేసుల దర్యాప్తు, వేగ వంతమైన విచారణకు సాంకే తిక పరిజ్ఞానం ఆధారిత స్మార్ట్‌ పోలీసింగ్‌ కీలకమని ఎస్పీ స్పష్టం చేశారు. వీటితో పాటు మరికొన్ని అంశాలపైనా ఎస్పీ సూచనలిచ్చారు.

Updated Date - Apr 02 , 2026 | 12:18 AM