నష్ట నివారణపై దృష్టి సారించండి: ఆర్డీవో
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:07 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం ప్రభావంతో భారీ వర్షాలు, వరద ముంపునకు గురైన పంట పొలాల్లోని నీటిని తక్షణం తొలగించి నష్ట నివారణపై దృష్టి సారించాలని ఆర్డీవో సాయిప్రత్యూష అన్నారు.
ఆమదాలవలస, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం ప్రభావంతో భారీ వర్షాలు, వరద ముంపునకు గురైన పంట పొలాల్లోని నీటిని తక్షణం తొలగించి నష్ట నివారణపై దృష్టి సారించాలని ఆర్డీవో సాయిప్రత్యూష అన్నారు. ముంపు ప్రాంతాలైన చీమలవలస, కలివరం, తొగరాం, దూసి గ్రామాల్లో ఆదివారం పర్య టించి పరిస్థితులను పరిశీలించారు. చీమలవలస, కలివరం గ్రామాల్లో పంట పొలాల్లో నిల్వ ఉన్న వరదనీటిని త్వరితగతిన బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని నీటిపారు దలశాఖాధికారులను ఆదేశించారు. తొగరాం, దూసి గ్రామాల్లో ఎస్కేఫ్ చానెల్స్‌ను పరిశీలించి భవిష్యత్తులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కాలువల అభివృద్ధి, నిర్వ హణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జి. నారాయణరావు, తహసీల్దార్ సత్యం, వ్యవసాయాధికారి మెట్ట మోహన్‌రావు, ఎంపీడీవో ఎం.వైకుంఠరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
వరద ప్రాంతాల్లో పర్యటన
బూర్జ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అల్లెన, పెద్దపేట, నీలాపురం, బూర్జ, వావాం, చీడి వలస, గుత్తావల్లి కాళపర్తి గ్రామాల్లోని పరిస్థితులను ఆర్డీవో సాయి ప్రత్యూష, మండల ప్రత్యేకాధికారి శైలజ పరిశీలించారు. ముంపు పొలాలను, జరిగిన నష్టాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి ఉషారాణి, ఇరిగేషన్ జేఈ దాలయ్య తదితరులు పాల్గొన్నారు.