Share News

పరిశుభ్రతపై దృష్టి సారించండి

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:18 AM

పాఠశా లలు, వసతి గృహాలు, అంగన్‌వాడీకేంద్రాల్లో వంట పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా దృష్టి సారించాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు బి. కాంతారావు ఆదేశించారు.

 పరిశుభ్రతపై దృష్టి సారించండి
పాఠశాలలో భోజనం నాణ్యత చూస్తున్న కమిషన్‌ సభ్యుడు కాంతారావు

రేషన్‌ దుకాణాల్లో రికార్డులుండాలి

రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు కాంతారావు

పొందూరు, జూలై 7 (ఆంధ్ర జ్యోతి): పాఠశా లలు, వసతి గృహాలు, అంగన్‌వాడీకేంద్రాల్లో వంట పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా దృష్టి సారించాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు బి. కాంతారావు ఆదేశించారు. పొందూ రులో మంగళవారం రేషన్‌ దుకాణాలు, అంగన్‌ వాడీ కేంద్రాలు, హాస్టళ్లు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనంలో పదార్థాల్లో నాణ్యత పాటించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎం ఈవోలు ఎం.వాగ్దేవి, పి.రాజారావులను ఆదేశిం చారు. పాఠ శాల విద్యార్థులతో ఎండీఎం నిర్వహ ణపై ఆరా తీశారు. రేషన్‌ దుకాణాలను పరిశీ లించారు. రేషన్‌ షాపుల్లో ఎటువంటి వివరాలు లేకపో వడంపై ఆగ్రహం వ్యక్తం చేసి తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ వెంక టేష్‌కు ఆదేశించారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను తనిఖీ చేసి స్టాక్‌ బోర్డు లేకపోవడంపై సంబం ధిత ఇన్‌ చార్జిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. గ్యాస్‌ సరఫరాలో డెలివరీ బాయ్స్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని గ్యాస్‌ను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు క్రయిస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన స్పందిస్తూ ఎన్నికేసులు నమోదు చేశారని సివిల్‌ సప్లై డీటీ సింహా చలాన్ని ప్రశ్నించారు. అంగన్‌వాడీ కేంద్రా లను తనిఖీ చేశారు. చిన్నారులకు సన్న బియ్యం కాకుండా రేషన్‌ బియ్యం సరఫరా కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన ఎండీఎం మాదిరి గా సన్నబియ్యం సరఫరా చేసేలా ప్రభు త్వంతో మాట్లాడతానన్నారు. కార్యక్రమంలో డీఎస్‌వో సూర్యప్రకాశరావు, ఐసీడీఎస్‌ పీడీ సువర్ణ, ఫుడ్‌ సేఫ్టీ అధికారి శ్రీరాములు, బీసీ గణవిభజన జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌ యాదవ్‌, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 12:18 AM