Share News

ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:12 AM

ఉద్యాన రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం రీజనల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ శాస్త్రవేత్త డా.మాధవీలత అన్నారు.

ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి

వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మాధవీలత

కంచిలి/కవిటి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ఉద్యాన రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం రీజనల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ శాస్త్రవేత్త డా.మాధవీలత అన్నారు. కంచిలి మండలం జలంత్రకోట, కొల్లూరు, కవిటి మండలం మాణిక్యపురం, రాజ పురం గ్రామాల్లో ఆయిల్‌ పామ్‌ పంటపై ఉద్యానశాఖ ఆఽధ్వర్యంలో మంగళవారం రైతు సదస్సు నిర్వహిం చారు. ఆయిల్‌పామ్‌ తోటల ఏర్పాటు కు స్థానిక పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామ న్నారు. ఆయిల్‌ పామ్‌ సాగు వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుం దన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖాధికారి మాధవీలత, వ్యవ సాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

‘లాభదాయక పద్ధతులతో సాగు’

పొందూరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సంప్రదాయ పంటలతోపాటు లాభదాయక వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ సాగు చేయాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ చిట్టిబాబు అన్నారు. బాణాం గ్రామంలో ఆత్మ సౌజన్యంతో మంగళవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వ హించారు. శాస్త్రవేత్త స్వాతి యాజమాన్య పద్ధతులు, కలుపు నివారణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్య క్రమంలో డీఆర్‌సీ ఏవో రేణుకా సాయి, ఏవో శ్రీనివాసబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2026 | 12:12 AM