ప్రజల అభిప్రాయం మేరకే ఫ్లైఓవర్
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:54 PM
ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మరోసారి గ్రామస్థుల అభిప్రాయం మేరకు ఫ్లైఓవర్‌పై నిర్ణయం తీసుకుంటామని పలాస ఆర్డీవో ఆర్.అప్పలరాజు భరోసా ఇచ్చారు.
సోంపేట రూరల్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మరోసారి గ్రామస్థుల అభిప్రాయం మేరకు ఫ్లైఓవర్‌పై నిర్ణయం తీసుకుంటామని పలాస ఆర్డీవో ఆర్.అప్పలరాజు భరోసా ఇచ్చారు. గురువారం మండలంలోని పాలవలస రైల్వేగేటుపై ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్న నేపధ్యంలో గేటు పరిసరాలను అప్పలరాజు రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. 20 ఏళ్ల కిందట పాలవలస రైల్వేగేటు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం భూసేకరణ చేశారని, తాజాగా గేటుకు అవతల వైపు ఉన్న ఆలయాలు, పొలాలు, శ్మశాన వాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా వాహ నాలు రాకపోకలు కోసం బ్రిడ్జితోపాటు అండర్‌పాసేజ్ నిర్మించాలని గ్రామస్థులు ఆర్డీవోను కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ అప్పలస్వామి, స్థానికులు చెల్లూరి ధర్మారావు, సంగారు లక్ష్మీనారాయణ, దున్న కేశవరావు, మోహన్‌రావు, గోకర్ణ కృష్ణా రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్ పాల్గొన్నారు.