Share News

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:06 AM

జిల్లాలో వివిధ దేవాలయాల్లో ఆదివారం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శ్రావణ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా కల్యాణాలు కన్నుల పండువగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

జిల్లాలో వివిధ దేవాలయాల్లో ఆదివారం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శ్రావణ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా కల్యాణాలు కన్నుల పండువగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఆదిత్యుని ఆలయంలో కల్యాణం

అరసవల్లి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి శ్రీ సూర్య నారాయణ ఆల యంలో ఆదివారం శ్రావణ శుద్ధ ఏకా దశి సందర్భంగా ఉషా, ఛాయా, పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆల య ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు వేదమం త్రాలు, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, అర్చకుడు ఇప్పిలి సాందీపశర్మ, వేద పండితుడు దర్భముళ్ల శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.

అన్నదానానికి భక్తుల విరాళాలు

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథ కానికి పలువురు దాతలు ఆదివారం విరాళం అందజేశారు. విశాఖపట్నానికి చెందిన పోతి న వెంటకరమణ రూ.1,00,116, శ్రీకాకుళం నగరానికి చెందిన జాక సాంబమూర్తి, లక్ష్మి దంపతులు రూ.1,00,116 విరాళాన్ని సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావుకు అందించారు. దాతల పేరున ప్రత్యేక పూజలు చేసి స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

రామానందమయి దివ్యక్షేత్రంలో..

శ్రీకాకుళం కల్చరల్‌, ఆగస్టు 23(ఆంధ్రజ్మోతి): శ్రీకాకుళం రూరల్‌ మండలం భైరి గ్రామంలోని రామానందమయి దివ్యక్షేత్రంలో ఆదివారం రుక్మిణీ కల్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని దేవాలయ ప్రతిష్ఠాపనాచార్య అంపోలు రుద్రకోటేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ఈ కార్యక్రమం చేపట్టారు. 108 మంది కన్య లతో ఈ కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహిం చారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

వేణుగోపాలస్వామికి విశేష పూజలు

గార, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): శాలిహుం డాంలోని శ్వేతగిరిపై వెలసిన రుక్మిణి, సత్య భామా సమేత కాళీయమర్దన వేణుగోపాల స్వామికి ఆదివారం విశేష పూజలు, అభిషే కాలు చేశారు. శ్రావణ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా ధర్మకర్తలు సుగ్గు మధురెడ్డి దంపతులు, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో అర్చకుడు సాయిశర్మ సుప్రభాతసేవ, పంచా మృతాభిషేకం, విశేష పుష్ప అలం కరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ధనరాజ తులసమ్మతల్లి సంబరం

ఇచ్ఛాపురం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ధన రాజ తులసమ్మ తల్లి సంబరాన్ని భక్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అమ్మవారి ఘటాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి చల్లదనం చేసి మొక్కులు చెల్లించారు.

కమనీయం.. వెంకటేశుని కల్యాణం

పొందూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పొందూరు యర్రావారి కల్యా ణ మండపంలో ఆదివారం శ్రీనివాస కల్యాణం కమనీయంగా నిర్వ హించారు. శ్రీకాకుళం నగరం డీసీసీబీ కాలనీలోని శ్రీభూ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయం ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకుల వేద మంత్రాల నడుమ ఘనంగా చేపట్టారు. వర్షాలు కురి సి పంటలు పండాలని, నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరు కుంటూ ఈ కల్యాణం చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకుడు చామ ర్తి గోపాలాచార్యులు, రుత్వికులు ఉగ్ర నరిసింహాచార్యులు, చామర్తి సీతారామాంజనేయులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షుడు దుంపల సన్యాసిరావు, ఎమ్మెల్యే రవికుమార్‌ సతీమణి కూన ప్రమీల పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 12:06 AM