వరుణుని కరుణ కోసం వరదపాయసం
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:43 AM
వరుణ దేవుని కరుణ కోసం చల్లవానిపేట, పంగవానిపేట గ్రామస్థులు గుంజుమెట్ట వద్ద గురువారం వరదపాయసం పోసి ప్రత్యేక పూజలు చేశారు.
జలుమూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): వరుణ దేవుని కరుణ కోసం చల్లవానిపేట, పంగవానిపేట గ్రామస్థులు గుంజుమెట్ట వద్ద గురువారం వరదపాయసం పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రాంతంలో పది రోజులుగా వర్షాభావ పరిస్థితులతో వరి ఎదలు ఎండిపోయాయి. దీంతో చల్లవానిపేట, పంగవానిపేట గ్రామస్థులు వరుణిదేవునికి ప్రత్యేక పూజలు చేసి... వర్షాలు కురవాలని వరదపాయసం పోశారు. ఈ కార్యక్రమంలో పురోహితులు రాజశేఖరశర్మ, గ్రామస్థులు పాల్గొన్నారు.