తేలుకుంచి గ్రామంలో విదేశీ పక్షుల సందడి
ABN , Publish Date - Jul 30 , 2026 | 01:16 AM
తేలుకుంచి గ్రామానికి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి విదేశీ పక్షులు వస్తాయి. సంతానోత్పత్తి తరువాత తిరిగి వెళ్లిపోతాయి. ఏడు నెలల పాటు ఇక్కడే ఉంటాయి.
సుదూర ప్రాంతాల నుంచి..
సైబీరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, హంగేరీ దేశాల నుంచి సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో దాదాపు 14వేల కిలోమీటర్లు ప్రయాణించి పక్షులు తేలుకుంచికి చేరుకుంటాయి.
ఏడు నెలలు విడిదిచేసి..
ఇక్కడ గూళ్లు కట్టుకుని గుడ్లు పొదికి పిల్లలు పెద్దయ్యాక తిరిగి మార్చి, ఏప్రిల్ నెలల్లో స్వదేశాలకు వెళ్తాయి. ఈ పక్షలు వస్తే పంటలు బాగా పండుతాయని స్థానిక రైతుల నమ్మకం.
రక్షణలేక మృత్యువాత
చెట్ల కింద సరైన రక్షణ వలలు లేకపోవడంతో గాలికి గుడ్లు కిందపడి పోతున్నాయి. చిన్నపిల్లలు కూడా కిందపడి చనిపోతున్నాయి. అలాగే కోతుల దాడి కూడా ఈ విదేశీ పక్షులకు శాపంగా మారింది.
గాల్లో కలిసిన మాస్టర్‌ప్లాన్
2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒడిశా-ఏపీ సరిహద్దు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే గత వైసీపీ పాలనలో దీన్ని అస్సలు పట్టించుకోలేదు.
కూటమి ప్రభుత్వంపై ఆశలు
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధికారంలో ఉంది. వెంటనే చెట్లకు రక్షణ వలలు ఏర్పాటు చేయడంతో పాటు తేలుకుంచిని శాశ్వత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దేశాల సరిహద్దులు, ఖండాలు దాటుకుని వచ్చే విదేశీ అతిథులకు ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామం ఆశ్రయమిస్తోంది. సైబీరియా తదితర దేశాల నుంచి ప్రత్యుత్పత్తి కోసం వేలాది కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే ఈ విహంగాలకు భద్రత లేకుండా పోతోంది. ఏళ్లు గడుస్తున్నా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందకపోవడం, రక్షణ చర్యలు కరువై పోవడంతో ఈ అరుదైన పక్షుల నివాసకేంద్రం ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
సంతానోత్పత్తికి వేల కిలోమీటర్ల నుంచి రాక
కేంద్రంలో కానరాని సరైన వసతులు
పడకేసిన కీలకమైన పర్యాటక ప్రాజెక్టు
ఇచ్ఛాపురం, జూలై 29(ఆంధ్రజ్యోతి): తేలుకుంచి గ్రామానికి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి విదేశీ పక్షులు వస్తాయి. సంతానోత్పత్తి తరువాత తిరిగి వెళ్లిపోతాయి. ఏడు నెలల పాటు ఇక్కడే ఉంటాయి. స్థానికులను కనువిందు చేస్తాయి. వీటిని తిలకించేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే అందుకు తగ్గట్టు ఏర్పాట్లు లేకపోవడం లోటుగా మారింది.
ఈ అనుకూలతలతోనే..
తేలుకుంచి చిత్తడి, తంపర నేల లకు ప్రసిద్ధి. ఇక్కడ పక్షులకు స మృద్ధిగా ఆహారం లభిస్తుంది. సం తానోత్పత్తికి అనుకూలమైన వాతా వరణం ఉంటుంద. అందుకే విదే శాల నుంచి పక్షులు వస్తుంటాయి. ముఖ్యంగా సైబీరి యా, జర్మనీ, ఆస్ర్టేలియా, సింగపూర్, మలేషియా, హంగేరి దేశాల నుంచి 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు చేరుతుంటాయి. సెప్టెంబరు, అక్టోబరులో ఇక్కడకు వచ్చి గుడ్లు పెట్టి సంతానోత్పత్తి జరుపుతాయి. పిల్లలు పెద్దాయ్యాక.. మార్చి, ఏప్రిల్‌లో తిరుగు పయనమవుతాయి. ఇవి వస్తే పంటలు బాగా పండుతాయని రైతుల ప్రగాడ నమ్మకం. ప్రస్తుతం పెద్ద ఎత్తున ఇక్కడకు విదేశీ పక్షులు చేరుకున్నాయి.
ఏటా ఇదే పరిస్థితి..
ఏటా ఇక్కడ వందలాది పక్షులు మృత్యువాత పడుతు న్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడువచ్చినవి గుడ్లు పెడుతున్నాయి. సంతానోత్పత్తికి సరైన ఏర్పాట్లు లేక గుడ్లతో పాటు పక్షులు చెట్టు నుంచి జారిపడి మృత్యువాత పడుతున్నాయి. కనీసం చెట్లకు వలలు ఏర్పాటుచేసినా కొంత వరకూ పక్షుల మృత్యువాత అడ్డుకోవచ్చు. దీనికితోడు కోతులతో పక్షులకు కష్టాలు తప్పడం లేదు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ కేంద్రాన్ని గాలికొదిలేసింది. పరిసరాలు అధ్వానంగా మారాయి. పక్షుల విసర్జనతో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులను అభివృద్ధి చేస్తే పక్షులకు కొంతవరకూ ఉపయోగపడే అవకాశముంది. ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.
పర్యాటకాభివృద్ధికి అవకాశం..
అటవీ, పర్యాటక శాఖ సంయుక్తంగా చర్యలు చేపడితే విదేశీ పక్షుల విడిది కేంద్రం అభివృద్ధి సాధించే అవకాశముంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ కొన్నిరకాల నిర్మాణాలు జరిగాయి. చివరిగా 2019లో టీడీపీ ప్రభుత్వం తేలుకుంచిని రెండు రాష్ట్రాల పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అధికారం మారడంతో అవన్నీ బుట్టదాఖలు అయ్యాయి. దీన్ని అభివృద్ధి చేస్తే ఒడిశా, ఏపీకి సరిహద్దు ప్రాంతం కావడంతో రెండు రాష్ట్రాలకు పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది. దీనికితోడు చెంతనే సముద్ర తీరం ఉండడం కలిసి వచ్చే అంశం. కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని పర్యాటకులు కోరుతున్నారు.
పక్షుల బాధ వర్ణనాతీతం
విదేశీ పక్షులు వచ్చినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. అవి వస్తేనే ఈ ప్రాంతంలో సమృద్ధిగా పంటలు పండుతాయని మా నమ్మకం. కానీ ఈ కేంద్రంలో పక్షులు పడే బాధలు వర్ణనాతీతం. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో చెట్లపై నుంచి జారిపడి గుడ్లు పగిలిపోతుంటాయి. పక్షులు సైతం మృత్యువాత పడుతుంటాయి. ఆ సమయంలో చాలా బాధేస్తోంది.
- ఎం.నారాయణరెడ్డి, స్థానికుడు, తేలుకుంచి
పర్యవేక్షణ కరువు..
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పర్యవేక్షణ ఉండేది. కానీ ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీస స్థాయిలో లేకుండా పోయింది. అటు అటవీశాఖ పట్టించుకోలేదు. పర్యాటక శాఖ సైతం తమ పనికాదన్నట్టు ఉండిపోయింది. కూటమి వచ్చిన తరువాత కాస్త మార్పు కనిపిస్తోంది. అయినా సరే పటిష్ట ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.
- మేరుగు సూర్యనారాయణ, స్థానికుడు, తేలుకుంచి
ప్రత్యేకంగా దృష్టి
తేలుకుంచి విదేశీ పక్షుల విడిది కేంద్రంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. అటవీ శాఖపరంగా మొక్కలు కూడా నాటి సంరక్షిస్తున్నాం. పక్షుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం. శాశ్వత నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదనలు చేశాం. త్వరలో వాటికి మోక్షం కలుగుతుందని ఆశిస్తున్నాం.
- పి.అమ్మనాయుడు, ఇన్‌చార్జి అటవీరేంజ్ అధికారి, కాశీబుగ్గ