Share News

పల్టీలు కొడుతూ..

ABN , Publish Date - May 01 , 2026 | 01:05 AM

గొప్పిలి నుంచి పలాస వస్తున్న ఓ ఆటో అల్లుఖోల గ్రామం వద్ద ఉన్న హరిసాగరం చెరువులో పల్టీలు కొడుతూ బో ల్తాపడింది.

పల్టీలు కొడుతూ..
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

  • హరిసాగరంలో ఆటో బోల్తా

  • ఏడుగురికి తీవ్ర గాయాలు

  • చెరువులో పూర్తిస్థాయిలో నీరు లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం

  • అల్లుఖోల గ్రామం వద్ద ఘటన

పలాస, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): గొప్పిలి నుంచి పలాస వస్తున్న ఓ ఆటో అల్లుఖోల గ్రామం వద్ద ఉన్న హరిసాగరం చెరువులో పల్టీలు కొడుతూ బో ల్తాపడింది. ఈ ఘటనలో మొత్తం డ్రైవరుతో సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి ప రిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కి త రలించారు. చెరువులో నీరు లేకపోవడంతో పెద్ద ప్ర మాదం తప్పింది. లేకుంటే భారీ ప్రాణనష్టం జరిగేది. క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంఽ దించి పోలీసులు, ప్రత్యేక్ష సా క్షులు తెలిపిన వివరాల మేరకు..

మెళియాపుట్టి మండలం గొప్పిలి గ్రామం నుంచి పలాస వైపు వస్తున్న ఆటోలో డ్రైవర్‌తో సహా ఏడు గురు ఉన్నారు. అల్లుఖోల గ్రామం వద్ద ఉన్న హరి సాగరం చెరువు గట్టుపై ఉన్న రహదారి చివర ఆటో ప్రమాదవశాత్తు బోల్తాపడి ంది. దొర్లుకొంటు వెళ్లి చెరువులో పడిపోయింది. 40 అడుగుల మేర రోడ్డు నుంచి చెరువులోకి పడిపోవడంతో ఆటోలో ప్రయాణి స్తున్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. గోకర్నపురం గ్రామానికి చెందిన వీఆర్వో లీలారాణి, రెం టికోట గ్రామానికి చెందిన ఇప్పిలి సంపత్‌, అదే గ్రామానికి చెందిన ఎ.అచ్చెమ్మ, అల్లు ఖోల గ్రామానికి చెందిన దువ్వాడ లక్ష్మీ దేవి, మందస మండలం కుడుమాసింగి గ్రామా నికి చెందిన ఆటో డ్రైవరు సవర జేమ్స్‌, కరజాడ గ్రామానికి చెందిన కె.త్రినా థ్‌తో పాటు మరొకరు ఈ ప్రమాదంలో గా యపడ్డారు. వీరిలో సంపత్‌ పరిస్థితి ఆందో ళన కరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మిగిలిన వారందరికీ కాళ్లు, చేతులు విరిగిపోయాయి. వీరం దరికి స్థానిక ఆసుపత్రిలోనే వైద్యులు చికిత్స అంది స్తున్నారు. ఘటనా స్థలానికి కాశీబుగ్గ పో లీసులు పరిశీలించి ప్రమాదానికి గల కార ణాలు క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నా రు. వేసవి కావడం తో 80 శాతానికి పైగా చెరువులో నీరు లేకపోవడంతో పెద్ద ప్రమా దం తప్పింది. లేకుంటే నీటిలో ఆటో బోల్తా పడే ప్రమాదం ఉండేది. నీరులేని కారణం గా ప్రయాణికులంతా గాయాలతో బయట పడ్డారు. కాశీబుగ్గ ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 01 , 2026 | 01:05 AM