పలాస రైల్వే స్టేషన్ వద్ద వంద అడుగుల ఎత్తులో జెండా ఆవిష్కరణ
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:50 PM
పలాస రైల్వేస్టేషన్ వద్ద వంద అడుగుల ఎత్తులో భారీ జాతీయజెండాను సోమవారం అధికారులు ఎగుర వేశారు. రైల్వేశాఖ ఆదేశాల మేరకు అమృత్ భారత్ రైల్వేస్టేషన్‌గా గుర్తించి అభివృద్ధి చేస్తున్న ఇక్కడ దీన్ని ఏర్పాటుచేశారు. జెండా ఎగురవే యడానికి వీలుగా నెలరోజుల కిందట కాంక్రీట్ ఫౌండేషన్, దాన్ని ఉక్కుతో తయారు చేసిన వంద అడుగుల స్తంభాన్ని నిర్మించారు.
పలాస, జనవరి 26(ఆంధ్రజ్యోతి): పలాస రైల్వేస్టేషన్ వద్ద వంద అడుగుల ఎత్తులో భారీ జాతీయజెండాను సోమవారం అధికారులు ఎగుర వేశారు. రైల్వేశాఖ ఆదేశాల మేరకు అమృత్ భారత్ రైల్వేస్టేషన్‌గా గుర్తించి అభివృద్ధి చేస్తున్న ఇక్కడ దీన్ని ఏర్పాటుచేశారు. జెండా ఎగురవే యడానికి వీలుగా నెలరోజుల కిందట కాంక్రీట్ ఫౌండేషన్, దాన్ని ఉక్కుతో తయారు చేసిన వంద అడుగుల స్తంభాన్ని నిర్మించారు. అనంతరం ఆరు మీటర్ల పొడవు, రెండుమీటర్ల వెడల్పుతో జాతీ య పతాకాన్ని ఎగురవేశారు. నిరంతరం ఎగిరే విధంగా ప్రత్యేకంగా తయారు చేశారు. ప్రస్తుతం జాతీయ పతాకం రెపరెపలతో పలాస రైల్వే స్టేష న్ సుందరంగా మారింది. జాతీయజెండా ప్రత్యే క ఆకర్షణగా నిలుస్తోంది. పలాస-కాశీబుగ్గ మునిసి పాలిటీ నుంచి ఎక్కడి నుంచైనా దీన్ని వీక్షించడా నికి వీలుగా భారీ నిర్మించడం విశేషం.