ఐదు రోజుల పనిదినాలు ప్రకటించాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:55 PM
అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని సిబ్బంది మంగళవారం సమ్మె చేయడంతో బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఇన్స్యూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, సెబీ, ఫైనా న్షియల్ రెగ్యులేటర్లకు వారంలో ఐదురోజులు మాత్రమే పనిదినాలని, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు ఆరురోజులు పనిదినాలుగా ఉన్నాయని సంఘ నాయకుడు సీతారాం తెలిపారు.
పలాస/పాతపట్నం/టెక్కలి/జలుమూరు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని సిబ్బంది మంగళవారం సమ్మె చేయడంతో బ్యాంకులు మూతపడ్డాయి. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఇన్స్యూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, సెబీ, ఫైనా న్షియల్ రెగ్యులేటర్లకు వారంలో ఐదురోజులు మాత్రమే పనిదినాలని, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు ఆరురోజులు పనిదినాలుగా ఉన్నాయని సంఘ నాయకుడు సీతారాం తెలిపారు. పలాస, పాతపట్నం ఎస్‌బీఐ కార్యాల యాల వద్ద ఉద్యోగులు ఐదురోజుల పనిదినాలు ప్రకటించాలని ఆలిండి యా ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు సమ్మె నిర్వహించారు.