వరకట్న వేధింపుల కేసులో ఐదుగురి అరెస్టు
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:08 AM
పట్టణంలోని వెంగళరావుకాలనీకి చెందిన యండమూరి అపర్ణ మృతి కేసులో శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకా నంద ఆధ్వర్యంలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలి పారు.
ఆమదాలవలస, మార్చి 26(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వెంగళరావుకాలనీకి చెందిన యండమూరి అపర్ణ మృతి కేసులో శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకా నంద ఆధ్వర్యంలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలి పారు. గురువారం ఆమదాలవలసలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అపర్ణ ప్రేమ వివాహం చేసుకొందని తెలిపారు. అత్తంటివారి వేధింపుల వల్ల ఆత్మహ త్యాయత్నానికి పాల్పడిన అపర్ణ బుధవారం రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. వరకట్నం వేధింపుల వల్ల అపర్ణ మృతి చెందడంతో కేసును డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిపినట్లు తెలిపారు. అనంతరం భర్త వద్రగడ్డి సుధీర్‌తో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులను అరెస్టు చేసినట్లు చెప్పారు. జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి రిమాండ్ విధించగా.. అంపోలు జిల్లా జైలుకు తరలించినట్లు తెలిపారు.
అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు: ఎస్‌ఐ
హిరమండలం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): పాత హిరమండలం గ్రామానికి చెందిన బాలిక మరణం.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ హేమంత్ కల్యాణ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ బాలిక మృతిపై ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేస్తున్నారని, ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు ఖననం చేశారు.