Share News

‘వంశధార’లో చేపలవేటకు లైసెన్స్‌ తప్పనిసరి

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:38 PM

వంశధార రిజర్వాయర్‌లో చేపలవేట నిర్వహించే ప్రతి మత్య్సకారుడు తప్పనిసరిగా చేపలవేట లైసెన్స్‌ కలిగి ఉండాలని మత్స్యశాఖఅధికారి సరళ తెలిపారు.

‘వంశధార’లో చేపలవేటకు లైసెన్స్‌ తప్పనిసరి
మత్స్యకారులతో మాట్లాడుతున్న సరళ :

హిరమండలం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): వంశధార రిజర్వాయర్‌లో చేపలవేట నిర్వహించే ప్రతి మత్య్సకారుడు తప్పనిసరిగా చేపలవేట లైసెన్స్‌ కలిగి ఉండాలని మత్స్యశాఖఅధికారి సరళ తెలిపారు. సోమవారం హిరమండలం మత్స్యశాఖ కార్యాల యంలో మత్స్యకార సహకారసంఘ సభ్యులు మత్స్యశాఖ అధికారి సరళను కలిశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వంశధార రిజర్వాయర్‌ పరిధిలో మొత్తం ఏడు మత్స్యకార సహకారసంఘాలు ఉండగా, ఆయాసంఘాల్లో 800 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. రిజర్వాయర్‌లో చేపలవేటకు లైసెన్సింగ్‌ విధానం 2025 నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పారు. వంశధార రిజర్వాయర్‌లో చేపలవేట కొన సాగించాలనుకునే ప్రతి మత్స్యకారుడు లైసెన్స్‌ తప్పనిసరిగా రెన్చువల్‌ చేయించుకో వాలని తెలిపారు. ఇతర జిల్లాలకు చెందిన మత్స్యకారులకు వంశధార రిజర్వాయర్‌లో చేపలవేట నిర్వహించడానికి అనుమతి లేదని చెప్పారు. లైసెన్స్‌ లేకుండా చేపలవేట నిర్వహించిన, ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు అనుమతి లేకుండా చేపల వేట నిర్వ హించినా మత్స్యశాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Updated Date - Sep 07 , 2026 | 11:38 PM