సీఎం దృష్టికి మత్స్యకారుల సమస్యలు
ABN , Publish Date - May 23 , 2026 | 11:21 PM
ఎచ్చెర్ల నియోజక వర్గం పరిధిలోని మత్స్యకారుల సమస్యలను ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు.
చంద్రబాబును కలిసిన ఎంపీ కలిశెట్టి
రణస్థలం/సోంపేట రూరల్, మే 23 (ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల నియోజక వర్గం పరిధిలోని మత్స్యకారుల సమస్యలను ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర సచివాలయంలో సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చేప ట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఆయనతో పాటు మత్స్యకార నాయకుడు దుమ్ము అశోక్ తదితరులున్నారు.
పోర్టు బ్లెయిర్ నుంచి విశాఖకు నేరుగా విమాన సర్వీస్ నడిపేందుకు చర్యలు తీసుకోవాలని అండమాన్ జాయింట్ యాక్షన్ తెలుగు కమ్యూనిటీ ప్రధాన కార్యదర్శి బైపల్లి హేమ రాజు కోరారు. ఈ మేరకు ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడుతో కలిసి సీఎంను కలిసి వినతిపత్రం అందించారు. సీఎంను కలిసిన వారిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్, తీర ప్రాంత మత్స్యకార ఐక్యవేదిక అధ్యక్షుడు బడే తమ్మారావు, అండమాన్ నికోబార్ టీడీపీ సెక్రటరీ వంక మోహన్‌రావు ఉన్నారు.