Share News

అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాల నివారణ

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:57 PM

అగ్ని ప్రమాదాల నివారణ అప్రమత్తతతోనే సాధ్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. స్థానిక అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. వారోత్సవాలకు సం బంధించిన పోస్టర్లను ఆవిష్కరిం చారు.

 అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాల నివారణ
అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): అగ్ని ప్రమాదాల నివారణ అప్రమత్తతతోనే సాధ్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. స్థానిక అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. వారోత్సవాలకు సం బంధించిన పోస్టర్లను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమా దాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు సిబ్బంది చేసే సాహసాలు అభినంద నీయమన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం ఒక్కోసారి పెను ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. ఇళ్లలో గ్యాస్‌ వినియోగించినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండా లన్నారు. విపత్తుల కాలంలో అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి చేసే సేవలు వెల కట్టలేనివ న్నారు. అగ్ని ప్రమాదా లపై ప్రతి ఒక్క రిలో అవ గాహన పెంపొందిం చడమే లక్ష్యంగా ఈ వారోత్స వాలను నిర్వహి స్తున్నట్టు వివరించారు. అనంతరం సిబ్బంది మాక్‌ డ్రిల్‌ నిర్వహిం చారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో జడ్డు మోహన రావు, ఏడీఎఫ్‌వో శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 11:57 PM