Share News

కంటైనర్‌లో మంటలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:32 AM

Container truck rams into stationary lorry అర్ధరాత్రి వేళ జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కంటైనర్‌ ఢీకొంది. దీంతో కంటైనర్‌ క్యాబిన్‌లో మంటలు వ్యాపించి.. సుమారు రూ.4కోట్ల విలువైన పరికరాలు, వస్తువులు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి కోల్‌కత్తా వెళ్తున్న ఓ కంటైనర్‌.. ఆదివారం అర్ధరాత్రి మడపాం వంతెన వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ లారీని ఢీకొంది.

కంటైనర్‌లో మంటలు
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.. కంటైనర్‌లో దగ్ధమైన వస్తువులు

ఆగిఉన్న లారీ ఢీకొన్న వైనం

రూ.4కోట్ల విలువైన వస్తువులు దగ్ధం

నరసన్నపేట/ శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి వేళ జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కంటైనర్‌ ఢీకొంది. దీంతో కంటైనర్‌ క్యాబిన్‌లో మంటలు వ్యాపించి.. సుమారు రూ.4కోట్ల విలువైన పరికరాలు, వస్తువులు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి కోల్‌కత్తా వెళ్తున్న ఓ కంటైనర్‌.. ఆదివారం అర్ధరాత్రి మడపాం వంతెన వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ లారీని ఢీకొంది. దీంతో కంటైనర్‌ క్యాబిన్‌లో మంటలు వ్యాపించాయి. కంటైనర్‌తోపాటు.. లారీ కొంతమేరకు అగ్నికి ఆహుతయ్యాయి. వాటిలో ఉన్న విలువైన పరికరాలు దగ్ధమయ్యాయి. శ్రీకాకుళం, నరసన్నపేట నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఆ రెండు వాహనాలను పక్కకు తీసి.. మడపాం టోల్‌ప్లాజా వద్ద పార్కింగ్‌ ప్రదేశంలో ఉంచారు. సోమవారం మధ్యాహ్నం మళ్లీ ఆ కంటైనర్‌లో పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు, టోల్‌ప్లాజా సిబ్బంది పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ గణేష్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కాగా ఈ ప్రమాదంలో లారీలో ఉన్న గాజు సామగ్రి దగ్ధమైంది. కంటైనర్‌లో ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణ వస్తువులతోపాటు ఎలక్ర్టానిక్‌ పరికరాలు కాలిపోయాయి. సుమారు రూ.4కోట్ల వరకూ ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా.

మంటల్లో చిక్కుకున్న లారీడ్రైవర్‌..

మడ పాం వంతెనపై ఆదివారం అర్ధరాత్రి కంటైనర్‌ ఢీకొన్న ఘటనలో లారీడ్రైవర్‌ ములగాం యాదవ్‌ గాయపడ్డాడు. జార్ఘండ్‌ నుంచి ఒడిశా వైపు అద్దాల లోడుతో వెళ్తున్న లారీ సాంకేతిక లోపం కారణంగా మడపాం వంతెనపై ఆగిపోయింది. డ్రైవర్‌ లారీని నిలిపి కిందకు దిగి వాహనం ముందు భాగాన్ని పరిశీలిస్తున్న సమయంలో.. కంటైనర్‌ వెనుక నుంచి వచ్చి ఆగి ఉన్న లారీను ఢీకొంది. ఈ ప్రమాదంలో కంటైనర్‌ క్యాబిన్‌లో మంటలు చెలరేగి అవి ముందున్న అద్దాల లోడుతో ఉన్న లారీకి వ్యాపిం చాయి. లారీ దగ్ధమైంది. లారీడ్రైవర్‌ ములుగాం యాదవ్‌ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. రూరల్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి అక్కడకు చేరుకొని మంటలను అదుపుచేశారు. లారీడ్రైవర్‌ను శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడని శ్రీకాకుళం రూరల్‌ ఎస్‌ఐ కేవీ సురేష్‌ తెలిపారు.

Updated Date - Sep 22 , 2026 | 12:32 AM