Share News

రిమ్స్‌లో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:46 AM

నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) రేడియాలజీ విభాగం లో గురువారం తెల్లవారుజా మున విద్యుత్తు షార్ట్‌ స ర్క్యూట్‌తో అగ్పిప్రమాదం చో టుచేసుకుంది.

రిమ్స్‌లో అగ్నిప్రమాదం
ప్రమాదంలో కాలిపోయిన పరికరాలు

  • రేడియాలజీ విభాగంలో దగ్ధమైన కంప్యూటర్లు

అరసవల్లి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) రేడియాలజీ విభాగం లో గురువారం తెల్లవారుజా మున విద్యుత్తు షార్ట్‌ స ర్క్యూట్‌తో అగ్పిప్రమాదం చో టుచేసుకుంది. ఆ విభాగంలోని కంప్యూటర్‌, యూపీఎస్‌, రెండు ఫ్యాన్లు కాలిపోయాయి. సిబ్బం ది వెంటనే విద్యుత్తు సరఫ రాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమా పక పరికరాల సాయంతో మంటలను అదుపు చేశారు. అయితే 1000 పడకల ఆసుపత్రిలో 25 మంది ఎలక్ట్రీషియన్లు పనిచేయాల్సి ఉండగా, ముగ్గురితోనే నెట్టుకొ స్తున్నారు. ప్రజాప్రతినిధులు ఆసుపత్రిని సందర్శించడం, హామీలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్ల కొరత వాస్తవమేనన్నారు. ఇప్పటికే డీఎంఈకి నివేదిక అందజేశామని తెలిపారు.

Updated Date - Apr 17 , 2026 | 12:46 AM